Site icon HashtagU Telugu

Big Cheating : హీరోయిన్ చేస్తామంటూ మాజీ సీఎం కూతురికి రూ.4 కోట్లు కుచ్చుటోపీ

Former Cm Ramesh Pokhriyal Daughter Arushi Nishank Cheated For Film Role Uttarakhand

Big Cheating : సినిమాలో నటించే అవకాశాన్ని పొందే క్రమంలో ఎంతోమంది మోసపోతుంటారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కూతురు కూడా ఈవిధంగా మోసపోయారు. సినీ నిర్మాతలం అని చెప్పుకుంటూ ముంబైలోని జుహూ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమె నుంచి రూ.4 కోట్లు తీసుకొని బిచాణా ఎత్తేశారు.

Also Read :BJPs Capital Gain : నిర్మల ‘సున్నా ట్యాక్స్’ సునామీ.. ఆప్ ఢమాల్

మోసం ఇలా చేశారు..

ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కుమార్తె ఆరుషి నిశాంక్. ఈమెకు మొదటి నుంచీ నటన అంటే మహా ఇష్టం. పలు చిన్నతరహా సినిమాల్లో ఇప్పటికే నటించారు కూడా. సినిమాల్లో నటించేందుకు, సొంతంగా సినిమాలు తీసేందుకు హిమశ్రీ ఫిల్మ్స్ పేరుతో ఆరుషి ఒక సంస్థను నిర్వహిస్తున్నారు. ముంబైకి చెందిన మాన్సీ వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లాలు తాము సినీ నిర్మాతలం అంటూ ఆరుషి నిశాంక్ ఇంటికి వచ్చారు. ఆమెతో భేటీ అయ్యారు.  తాము త్వరలో తీయనున్న ‘ఆంఖోన్ కీ గుస్తాఖియా’ సినిమాలో కీలకమైన హీరోయిన్ పాత్రను ఇవ్వాలంటే.. రూ.5 కోట్లు ఇవ్వాలని ఆరుషిని ఆ ఇద్దరు వ్యక్తులు(Big Cheating) కోరారు.  సినిమా విడుదలైన తర్వాత, 20 శాతం వడ్డీని కలిపి రూ.15 కోట్లను తిరిగిస్తామని ఆమెను బాగా నమ్మించారు. అందుకు ఆరుషి ఒప్పుకొని నాలుగు విడతల్లో మొత్తం రూ.4కోట్లను వారికి ఇచ్చుకుంది.

Also Read :Chanakya Strategies Mukesh: ‘సెఫాలజిస్ట్’ ఓటర్ల మానసికతను ఎలా విశ్లేషిస్తారు?

కట్ చేస్తే.. ఫిబ్రవరి 5న

కట్ చేస్తే.. ఫిబ్రవరి 5న వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్‌ల నుంచి ఆరుషి నిశాంక్  ఫోన్‌కు ఒక మెసేజ్ వచ్చింది. ఆమెకు కేటాయించిన హీరోయిన్ పాత్రను వేరే వాళ్లకు ఇచ్చేమని ఆ వ్యక్తులు తెలిపారు. సినిమా షూటింగ్ భారత్‌లో పూర్తయిందని, తదుపరిగా యూరప్‌లో షూటింగ్ జరుగుతుందన్నారు. దీంతో తన డబ్బులు వెనక్కి ఇచ్చేయమని ఆరుషి కోరింది. దీంతో  వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్‌లు హత్య చేయిస్తామంటూ ఆరుషిని బెదిరించారు. ఈమేరకు ఆరుషి నిశాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెహ్రాడూన్ నగర పోలీసులు ముంబైకి చెందిన మాన్సీ వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లా‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.