Chicken Curry: చికెన్ కర్రీలో చనిపోయిన చిట్టెలుక.. ముంబై రెస్టారెంట్ లో సిబ్బంది నిర్వాకం!

భోజనం చేసేందుకు బయటకు వెళ్లినప్పుడు భోజనంలో బొద్దింకలు, ఈగలు, దోమలు కనిపిస్తే భయంగా ఉంటుంది.

  • Written By:
  • Updated On - August 17, 2023 / 11:25 AM IST

సాధారణంగా భోజనం చేసేందుకు బయటకు వెళ్లినప్పుడు భోజనంలో బొద్దింకలు, ఈగలు, దోమలు కనిపిస్తే భయంగా ఉంటుంది. చికెన్ బదులు చిట్టెలుక వస్తే?  అలాంటి పరిస్థితి ఓ వ్యక్తికి ఎదురైంది. స్నేహితుడితో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లిన ఓ బ్యాంక్ మేనేజర్‌కి ఇలాంటి అనుభవమే ఎదురైంది. వారికి సరఫరా చేసిన చికెన్ కర్రీలో చనిపోయిన చిట్టెలుక కనిపించింది. కోపంతో సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే సిబ్బంది కూడా అతిగా స్పందించారు. క్షమాపణ చెప్పకుండా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.

ఇంకేముంది, కస్టమర్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. తనకు జరిగినదంతా వివరించి కేసు పెట్టాడు. స్పందించిన పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని మేనేజర్‌, వంట మనిషిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అనురాగ్ దిలీప్ సింగ్ (40) గోరేగావ్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆగస్టు 13న స్నేహితుడు అమీన్‌ఖాన్‌తో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. తర్వాత ఇద్దరూ బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌కి భోజనం చేసేందుకు వెళ్లారు. అక్కడ వారికి ఇష్టమైన చికెన్, మటన్ కర్రీలను ఆర్డర్ చేశారు.

కాసేపయ్యాక సర్వర్ వేడిగా ఉందని చెప్పిన ఫుడ్ తీసుకొచ్చాడు.  ఇష్టమైన కూర, భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో తాను తింటున్న కూరలో చికెన్ ముక్క కాస్త అసాధారణంగా ఉండటాన్ని అనురాగ్ గమనించాడు. కానీ అనురాగ్ అప్పటికే కొంత తిన్నాడు. దాన్ని బయటకు తీసి పరిశీలించగా అది చనిపోయిన ఎలుక అని గుర్తించి షాక్ కు గురయ్యాడు. కోపోద్రిక్తుడైన అనురాగ్ హోటల్ సిబ్బందికి ఫోన్ చేసి చికెన్ కూరలోకి ఎలుక పిల్ల ఎలా వచ్చిందని అడిగాడు. ఆ సమయంలో హోటల్ మేనేజర్ అందుబాటులో లేరు. దాంతో అతన్ని పిలిచి హోటల్‌కి తీసుకొచ్చి ఎలుకను చూపించారు. మేనేజర్ నిర్మొహమాటంగా సమాధానం చెప్పాడు. తన 22 ఏళ్ల సర్వీసులో ఇప్పటి వరకు ఇలాంటివి జరగలేదని సమాధానమిచ్చారు.

కోపోద్రిక్తుడైన అనురాగ్ తన స్నేహితుడితో కలిసి బాంద్రా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. చచ్చిన ఎలుకతో ప్రాణహాని ఉందన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నట్లు అనురాగ్, అతని స్నేహితుడు తెలిపారు. డాక్టర్లు కూడా మందులు రాశారని తెలిపారు. దీంతో పోలీసులు హోటల్‌కు వెళ్లి మేనేజర్‌తో పాటు మరో ఇద్దరు వంటవాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.