Gyanvapi Mosque Survey : జ్ఞానవాపి మసీదులో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నిర్వహిస్తున్న సర్వే ఉత్కంఠ రేపుతోంది.
శనివారం రోజు సాయంత్రం 5 గంటల వరకు జరిగిన సర్వేకు సంబంధించిన కొన్ని విషయాలు జాతీయ మీడియాలో వచ్చాయి.
Also read : Rakhi Festival-2 Days : ఈసారి రాఖీ పండుగ రెండు రోజులు.. ఎందుకంటే ?
“శనివారం ASI నిర్వహించిన సర్వేలో లభించిన శిథిలాలలో విగ్రహాలు దొరకలేదు.. కానీ ముక్కలు చేసిన విగ్రహాల అవశేషాలు బయటపడ్డాయి” అని జ్ఞానవాపి మసీదు కేసులో హిందూ పక్షం తరఫు న్యాయవాది సుధీర్ త్రిపాఠి చెప్పారంటూ కథనాలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో విగ్రహాలు బయటపడతాయనే ఆశాభావంతో ఉన్నామని సుధీర్ త్రిపాఠి అన్నారని ఆ కథనాల్లో ప్రస్తావించారు. మసీదుకు సంబంధించిన వుజూ ఖానా ప్రదేశం, ముస్లింలు నమాజ్ చేసే ప్రదేశంపై స్పెషల్ ఫోకస్ తో ASI సర్వే(Gyanvapi Mosque Survey) జరుగుతోందని న్యాయవాది సుధీర్ త్రిపాఠి చెప్పారని కథనంలో పేర్కొన్నారు. 17వ శతాబ్దం నాటి జ్ఞానవాపి మసీదు.. హిందూ దేవాలయం పునాదులపై నిర్మించబడిందా ? లేదా ? అనేది నిర్ధారించడానికి శాస్త్రీయ సర్వేను నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ఈ సర్వేపై నివేదికను సెప్టెంబర్ 2లోగా సమర్పించాలని వారణాసి కోర్టు ASIని కోరింది. ఈ సర్వే సమయంలో మసీదులో తవ్వకాలు జరపరాదని ASIకు సుప్రీంకోర్టు షరతు విధించింది.
Also read : Vizag : మూడు నెలల్లో విశాఖకు సీఎం.. వైజాగ్ సౌత్ ముంబై కాబోతుంది.. ఇదే రాజధాని..
వెయ్యి బాబ్రీలకు వరద గేట్లు ఎత్తేలా ఏఎస్ఐ రిపోర్ట్ ఉండొద్దు : ఒవైసీ
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) నిర్వహిస్తున్న శాస్త్రీయ సర్వేపై మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఏఎస్ఐ ఇవ్వబోయే సర్వే రిపోర్ట్ వెయ్యి బాబ్రీల (బాబ్రీ మసీదు) కోసం వరద గేట్లు తెరిచేలా ఉండదని ఆశిస్తున్నాను” అని ఆయన అభిప్రాయపడ్డారు. “ఏఎస్ఐ ఇవ్వబోయే సర్వే రిపోర్ట్ వల్ల డిసెంబర్ 23 కానీ .. డిసెంబర్ 6 కానీ మళ్లీ రిపీట్ కాకూడదని నేను ఆశిస్తున్నా. అయోధ్య తీర్పు ఇచ్చే సందర్భంగా పూజా స్థలాల చట్టం పరిరక్షణపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యాన్యాలను కూడా అగౌరవపర్చకూడదు” అని ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు.