Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ప్రేమ జంటను దారుణంగా హత్య చేసిన విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ప్రియురాలిని కలిసేందుకు ప్రియుడు వచ్చాడనే విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ అమ్మాయి తండ్రి, సోదరుడు కలిసి జంటను పట్టుకున్నారు. దీంతో తండ్రి, సోదరుడు ఇద్దరినీ హత్య చేశారు. ప్రియుడి మృతదేహాన్ని చెరకుతోటలో, బిడ్డ మృతదేహాన్ని సరయూ నది ఒడ్డున ఇసుకలో పాతిపెట్టారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటన గోండాలోని ధనేపూర్ లో జరిగింది. ఇక్కడి ఒక గ్రామానికి చెందిన సతీష్ కుమార్ చౌరాసియా (20) రాత్రి తన సొంత గ్రామానికి చెందిన ఆర్తి చౌరాసియా (19)ని కలవడానికి రహస్యంగా వెళ్లినట్లు తెలిసింది. విషయం గమనించిన ఆర్తి తండ్రి కృపారామ్, సోదరుడు రాఘవరామ్ ఇద్దరినీ పట్టుకున్నారు. ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. అక్కడితో ఆగకుండా జంటను దారుణంగా కొట్టి చంపారు. దీని తర్వాత, సతీష్ మృతదేహాన్ని గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని చెరకు తోటలో పడేశారు.
మరోవైపు, నిందితులు ఆర్తి మృతదేహాన్ని అయోధ్యలోని సరయూ నది ఒడ్డుకు తీసుకెళ్లి ఇసుకలో పాతిపెట్టారు. చాలా కాలంగా సతీష్ కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్ ఆర్తి ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు ఆర్తి తండ్రి, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. గట్టిగా విచారించగా జంట హత్యల విషయం బయటపడింది.
Also Read: Kiss Controversy: దుమారం రేపుతున్న ముద్దు వివాదం, స్పెయిన్‌లో నిరసనల హోరు