Site icon HashtagU Telugu

Dashmat Rawat: ‘జరగాల్సింది జరిగిపోయింది’ :దశమత్

Dashmat Rawat

New Web Story Copy 2023 07 06t150430.182

Dashmat Rawat: మధ్యప్రదేశ్‌ సిద్ధి జిల్లాలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన దేశవ్యాప్తంగా కలిచివేసింది. కూలీ చేసుకుంటూ గౌరవంగా బ్రతికే ఓ వ్యక్తిపై ఓ నీచుడు మూత్రవిసర్జన చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గిరిజన కూలీ కావడం ఆ వ్యక్తి చేసిన తప్పా అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే మూత్రవిసర్జన చేసిన నీచుడ్ని జీవితాంతం జైలులో పెట్టినా తప్పు లేదంటున్నారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ బాధితుడు దశమత్ రావత్ ను ఇంటికి పిలిపించుకుని మాట్లాడారు. జరిగిన దారుణానికి సీఎం క్షమాపణలు కోరారు. అతని కాళ్ళు కడిగి సన్మానించారు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతనిని స్నేహితుడిగా భావించారు. కాగా.. సీఎంతో మాట్లాడిన తరువాత దశమత్ మీడియాతో మాట్లాడాడు.

దశమత్ మాట్లాడుతూ… సీఎంని కలవడం చాలా సంతోషంగా ఉంది. సీఎం నా కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు, చాలా సంతోషంగా అనిపించిందని దశమత్ చెప్పాడు. ఇక తనపై మూత్ర విసర్జన విషయంపై దశమత్ ఇలా అన్నాడు… ‘ఏం చెప్పను, ఏమీ లేదు… జరగాల్సింది జరిగిపోయింది అని బాధపడ్డాడు.

గిరిజన దశమత్ పై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. దీనికి సంబందించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో ప్రవేశ్‌ను అరెస్టు చేశారు. అతనిపై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రవేశ్ ఇంటి అక్రమ కట్టడాన్ని కూడా బుల్డోజర్లతో కూల్చివేశారు.

Read More: Rahul and Bhatti: పీపుల్స్ మార్చ్ సక్సెస్.. భట్టికి కీలక బాధ్యతలు!