Site icon HashtagU Telugu

Delhi : గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారిన డ్యాన్స్ టీచ‌ర్.. పిల్ల‌ల త‌ల్లిదండ్రుల నుంచి..?

Crime

Crime

ఢిల్లీలో ఓ టీచ‌ర్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారాడు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.15 లక్షలు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ఓ డ్యాన్స్ టీచర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ ప్రాంతంలోని దయానంద్ విహార్ నివాసి తనకు తెలియని నంబర్ నుండి వాట్సాప్ ద్వారా తన కొడుకు, కుమార్తె ఫోటో వచ్చిందని.. రూ.15 ల‌క్ష‌లు ఇవ్వ‌క‌పోతే ఇద‌ర్ని చంపేస్తామ‌ని బెదిరించిన‌ట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి ఢిల్లీకి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విష్ణు మిశ్రాగా గుర్తించారు. అతనికి పదేళ్లుగా పరిచయం ఉంద‌ని… కుటుంబంలోని పిల్లలకు డ్యాన్స్ నేర్పించేవాడ‌ని పోలీసుల విచార‌ణ తేలింది. రెండో నిందితుడిని విష్ణు మిశ్రా స్నేహితుడు దుర్గా దత్ సింగ్‌గా గుర్తించారు. నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.