Site icon HashtagU Telugu

Dalit Woman : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ద‌ళిత మ‌హిళ‌పై లైంగిక వేధింపులు.. ఏడుగురు అరెస్ట్‌

Raped

Raped

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ముజఫర్‌నగర్ లో ద‌ళిత మ‌హిళ లైగింక వేధింపుల‌కు గురైంది. ఏడుగురు వ్యక్తులు లైంగికంగా వేధించి, తుపాకీతో ఆమె బట్టలు తొలగించి, ఆ ఘటనను వీడియో కూడా తీశారు.ఆ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఏడుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ముజఫర్‌నగర్‌ జిల్లా కొత్వాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆ తర్వాత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందని పోలీసులు తెలిపారు.బాధితురాలు గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లగా.. అక్కడ ఏడుగురు నిందితులు తనను లైంగికంగా వేధించి, తుపాకీతో తన బట్టలు విప్పమని బలవంతంగా వీడియో తీశారని పోలీసుల‌కు తెలిపింది. ఐపీసీ సెక్షన్ 354బి, 506, ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3, ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద పోలీసులు కేసు నమోదు చేసి ఆదివారం ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఆనంద్ దేవ్ మిశ్రా తెలిపారు. నిందితులను అనుజ్, కుల్దీప్, అంకిత్, రవి, రిజ్వాన్, చోటా, అబ్దుల్‌గా పోలీసులు గుర్తించారు.

Exit mobile version