Cyrus Mistry: టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

  • Written By:
  • Updated On - September 4, 2022 / 06:57 PM IST

టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (54) మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అహ్మదాబాద్ నుండి ముంబై వస్తుండగా పాల్ఘర్ జిల్లాలో సూర్యనది వంతెనపై ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు డ్రైవర్‌తో పాటు అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడిన వారందరినీ గుజరాత్‌లోని ఆస్పత్రికి తరలించారు.మహారాష్ట్రలోని నేషనల్ కాంగ్రెస్ ఎంపీ సుప్రియా సులే ‘‘ నా సోదరుడు సైరస్ మిస్త్రీ కన్నుమూశారు. నమ్మలేకపోతున్నాను’’ అని ట్వీట్ చేశారు.

1968 జూలై 4న సైరస్ మిస్త్రీ పల్లోంజీ మిస్త్రీ, పాట్ పెరిన్ దుబాష్ లకు జన్మించారు. బ్రిటన్ లోని ఇంపీరియల్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్, లండన్ బిజినెస్ స్కూల్ లో మేనేజ్ మెంట్ లో ఎంఎస్సీ పూర్తి చేశారు. 2006లో టాటా సన్స్ సంస్థకు డైరెక్టర్ అయ్యారు. 2011లో అదే సంస్థకు డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. టాటా కంపెనీకి చెందిన పలు సంస్థలకు ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. 2012లో టాటా గ్రూప్ చైర్మన్ గా రతన్ టాటా పదవీవిరమణ చేసిన తరువాత.