Site icon HashtagU Telugu

18 Killed : జోధ్‌పూర్ సిలిండర్ పేలుడు ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య‌

China Explosion

Bomb blast

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని ఓ గ్రామంలో సిలిండర్ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య 18కి చేరింది. వివాహ వేడుక సందర్భంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో 60 మంది గాయపడ్డారు. ప్రమాదంలో మరణించిన వారిలో తొమ్మిది మంది చిన్నారులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నారని జోధ్‌పూర్ జిల్లా రూరల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనిల్ కయల్ తెలిపారు. మహాత్మా గాంధీ ఆసుపత్రిలో చేరిన రోగుల్లో ఐదుగురు రోగుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మ‌రో 34 మంది రోగులకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు.
.
సోమవారం మరణించిన వారిలో వరుడి తల్లి కూడా ఉన్నట్లు స‌మాచారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఢిల్లీ వెళ్లే ముందు మహాత్మాగాంధీ ఆసుపత్రిని సందర్శించి వైద్యులతో మాట్లాడి రోగుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భుంగ్రా గ్రామంలో సోమవారం జరిగిన ప్రమాద స్థలాన్ని షెర్‌ఘర్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మీనా కన్వర్ సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు వేతనాన్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందించాలని ఆమె కోరారు. జోధ్‌పూర్‌ అంబులెన్స్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ముఖేష్‌ మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మృతదేహాన్ని జోధ్‌పూర్‌ నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు యూనియన్‌ ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్‌ అందజేస్తున్నట్లు తెలిపారు.