Indian Meteorological Department: అక్టోబర్ 24న సిత్రంగ్ తుఫాను తీవ్రతరం.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు..!

అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడన వ్యవస్థ తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్ర‌భుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

  • Written By:
  • Publish Date - October 22, 2022 / 10:42 PM IST

అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడన వ్యవస్థ తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్ర‌భుత్వాలు అప్రమత్తం అయ్యాయి. అండమాన్ సముద్రం మీదుగా ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి అక్టోబర్ 25న పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలను తాకుతుందని (ఐఎండీ) తెలిపింది. ఐఎండీ పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం.. అండమాన్ సముద్రం మీద అల్పపీడన ప్రాంతం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి అక్టోబరు 23న అల్పపీడనంగా ఆపై తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. అక్టోబరు 24 నాటికి ఈ వ్యవస్థ ఉత్తరం వైపు తిరిగి పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంపై తుఫానుగా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.

ఒడిశాలోని పూరీ, జగత్‌సింగ్‌పూర్, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, జాజ్‌పూర్, కియోంజర్, కటక్, ఖుర్దా జిల్లాలకు భారీ వర్షపాత హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. 24, 25 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనుంది. 24- 26 తేదీలలో అస్సాం & మేఘాలయ, అక్టోబర్ 23-26 తేదీలలో మిజోరాం & త్రిపురలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ అల్ప‌పీడ‌న‌ వ్యవస్థ గంగా పశ్చిమ బెంగాల్‌లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందనీ, అక్టోబర్ 24, 25 తేదీల్లో కోల్‌కతాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.