Site icon HashtagU Telugu

Cyclone Biparjoy: అలర్ట్.. రానున్న 4 గంటల్లో తీవ్ర తుఫానుగా బిపార్జోయ్.. ఏయే రాష్ట్రాలపై ప్రభావం ఉందంటే..?

Cyclone Biparjoy

Cyclone Mandous

Cyclone Biparjoy: రానున్న 4 గంటల్లో బిపార్జోయ్ తీవ్ర తుఫాను (Cyclone Biparjoy)గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 15 నాటికి ఇది తుఫానుగా ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు దక్షిణ-నైరుతి దిశలో 500 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉంది. వాతావరణ శాఖ ప్రకారం.. ఆదివారం (జూన్ 11) మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో బిపార్జోయ్ గంటకు 5 కి.మీ వేగంతో కదులుతోంది. జూన్ 15 నాటికి కచ్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని IMD తెలిపింది. అయితే ఇది తీరాన్ని తాకే అవకాశం లేదు. తుపాను పోర్‌బందర్‌కు 200-300 కి.మీ, నలియాకు 200 కి.మీల దూరం దాటే అవకాశం ఉంది.

IMD తాజా సమాచారం ప్రకారం.. తుఫాను ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు పోర్‌బందర్‌కు 510 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీరం సమీపించే కొద్దీ సిగ్నల్ వార్నింగ్ మారుతుంది. ప్రస్తుత అంచనా ప్రకారం ఇది గుజరాత్ తీరాన్ని తాకే అవకాశం లేదు. ఇండియన్ కోస్ట్ గార్డ్ యూనిట్లు ఓడలు, ఎయిర్‌క్రాఫ్ట్, రాడార్ స్టేషన్ల ద్వారా మత్స్యకారులకు సాధారణ సలహాలను పంపుతున్నాయి.

Also Read: 2.75 Lakhs Per Kg : ఇండియాకు వచ్చిన ప్రపంచంలోనే కాస్ట్లీ మ్యాంగో.. కిలో 2.75 లక్షలే!

మత్స్యకారులు అప్రమత్తం

‘బిపార్జోయ్’ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నందున గుజరాత్, డామన్ మరియు డయ్యూ తీరాల వెంబడి ఉన్న మత్స్యకారులు, నావికులు వచ్చే 5 రోజుల పాటు సముద్రంలోకి వెళ్లవద్దని ఇండియన్ కోస్ట్ గార్డ్ సూచించింది. గత వారం రోజులుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు మత్స్యకారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ తుపానుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బలమైన గాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం

తుఫాను కారణంగా రానున్న రెండు రోజుల్లో గుజరాత్‌లో గంటకు 35-40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీని తరువాత, గాలి వేగం పెరగవచ్చు. జూన్ 13-15 మధ్య తీర ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ. సౌరాష్ట్ర-కచ్ ప్రాంతంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు సంభవించవచ్చు.

కేరళలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్

తుపాను కారణంగా కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, కోజికోడ్, కన్నూర్‌తో సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తుఫాను ముందు జాగ్రత్త చర్యగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందాన్ని పోర్‌బందర్, గిర్ సోమనాథ్, వల్సాద్ బీచ్‌లలో మోహరించారు.