CWC Meeting in Delhi : బీజేపీ ‘ఫేక్ వేవ్’ పై సీడ‌బ్యూసీ భేటీ

కాంగ్రెస్ ముక్త భార‌త్ సాధ్య‌మా? నిజంగా బీజేపీ బ‌లంగా ఉందా? బ‌లంలేకున్నా ఉన్న‌ట్టు ఫోక‌స్ అవుతుందా?

  • Written By:
  • Publish Date - March 12, 2022 / 05:06 PM IST

కాంగ్రెస్ ముక్త భార‌త్ సాధ్య‌మా? నిజంగా బీజేపీ బ‌లంగా ఉందా? బ‌లంలేకున్నా ఉన్న‌ట్టు ఫోక‌స్ అవుతుందా? ప్ర‌జ‌ల మైండ్ ను సెట్ చేస్తుందా? కాంగ్రెస్ అధిష్టానం గేమ్ ఆడ‌టంలో ఎందుకు ఫెయిల్ అవుతోంది? నాయ‌క‌త్వం బ‌లంగా లేక‌పోవ‌డమేనా? ఇలాంటి అంశాల‌పై చ‌ర్చించడానికి కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ ఆదివారం స‌మావేశం కానుంది. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల త‌రువాత జీ 23 నేత‌ల వాయిస్ పెరుగుతోన్న క్ర‌మంలో కీల‌క భేటీ జ‌ర‌గ‌బోతుంది.గ్రాడ్ ఓల్డ్ పార్టీగా కాంగ్రెస్ కు వ‌ర‌స ప‌రాజ‌యాలు ఉన్నాయ‌ని సీనియర్ నేత గులాంన‌బీ ఆజాద్ గ‌ళం విప్పాడు. 2014 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 45 ఎన్నిక‌ల్లో కేవ‌లం 5 మాత్ర‌మే అనుకూలంగా ఉన్నాయ‌ని కాంగ్రెస్ ను ఎత్తిపొడిచాడు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో అత్య‌వ‌స‌రంగా సీడ‌బ్ల్యూసీ మీటింగ్ ను అధిష్టానం నిర్వ‌హిస్తోంది.ఓట‌మి వెనుక ఉన్న కార‌ణాల‌ను అన్వేషించ‌డంతో పాటు బీజేపీ ఆడుతోన్న మైండ్ గేమ్ పై చ‌ర్చించ‌డానికి స‌మాయాత్తం అయింది. ఐదు రాష్ట్రాల ఫ‌లితాల్లో పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైన‌స్. అక్క‌డ చోటుచేసుకున్న సంస్థాగ‌త మార్పులు ఆ పార్టీని ఘోరంగా దెబ్బ‌తీశాయి. ప్ర‌ధానంగా పీసీసీ అధ్య‌క్షుడు, సీఎంల ఎంపిక విష‌యంలో జ‌రిగిన త‌ప్పులు కాంగ్రెస్ పార్టీ ఓట‌మికి కార‌ణంగా క‌నిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోగా.. పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ గెంటేసిన మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ కూడా గెల‌లేక‌పోయాడు. మొత్తంగా కాంగ్రెస్‌కు చెందిన హేమీహేమీల‌ను పంజాబీలు మ‌ట్టి క‌రిపించారు. ఇక యూపీలో స్వ‌యంగా ప్రియాంకా గాంధీ ప్ర‌చారం చేసినా ఆమేథీ , రాయ‌బ‌రేలీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ అభ్య‌ర్థులను గెలుపించుకోలేక కాంగ్రెస్ చ‌తికిల ప‌డింది. మొత్తం 403 స్థానాల్లో కేవ‌లం 2 స్థానాల‌కు ప‌రిమితం కావ‌డం శోచ‌నీయం.

ఇలాంటి ఘోర ఓట‌మికి బాధ్యులు ఎవ‌రు అంటూ పార్టీ సీనియ‌ర్లు కాస్తంత గ‌ట్టిగానే గ‌ళం విప్పారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి గులాం న‌బీ ఆజాద్ స్వరం రీసౌండ్ ఇచ్చింది. ఫ‌లితంగా సీడ‌బ్ల్యూసీ స‌మావేశాన్నిఏర్పాటు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అత్య‌వ‌స‌రంగానే. ఆదివారం సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని కాసేప‌టి క్రితం ఏఐసీసీ నుంచి ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో జ‌రిగే సీడ‌బ్ల్యూసీ భేటీలో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాలపై పార్టీ చ‌ర్చించ‌నుంది.వాస్త‌వంగా దేశంలోని 29 రాష్ట్రాల్లో కేవ‌లం 10 రాష్ట్రాల్లో మాత్ర‌మే బీజేపీకి క్లియర్ మెజార్టీ ఉంది. సిక్కిం, మిజోరాం, త‌మిళ‌నాడు, ఏపీ అసెంబ్లీల్లో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. కేర‌ళ రాష్ట్రంలో 140 సీట్ల‌లో 1, పంజాబ్ 117 స్థానాల‌కు 3, బెంగాల్ 294 స్థానాల‌కు 3 , తెలంగాణ‌లోని 119 స్థానాల‌కుగాను ఐదుగురు, ఢిల్లీలో 70 స్థానాల‌కు 8 , ఓడిస్సాలో 147 స్థానాలుంటే 10, నాగాలాండ్ లో 60 స్థానాల‌కు 12 మంది ఎమ్మెల్యేల‌ను మాత్ర‌మే బీజేపీకి ఉన్నారు. మేఘాల‌య‌లోని 60 స్థానాల్లో 2 మాత్ర‌మే బీజేపీ కి ఉన్నాయి. కానీ, అక్క‌డ సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని బీజేపీ న‌డుపుతోంది. బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాల్లో 53 మాత్ర‌మే బీజేపీకి ఉన్నాయి. కానీ అక్క‌డ సంకీర్ణ ప్ర‌భుత్వానికి కీల‌క అయింది. ఇక జమ్మూ, క‌శ్మీర్ అసెంబ్లీలో 87 స్థానాల‌కుగాను 25 మంది ఎమ్మెల్యేల‌ను బీజేపీకి ఉన్నారు. అక్క‌డ కూడా సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని క‌మ‌ల‌ద‌ళం న‌డుపుతోంది. గోవా రాష్ట్రంలో 40 సీట్ల‌కు 13 మాత్రమే బీజేపీకి ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ సంకీర్ణ స‌ర్కార్ ను న‌డుపుతోంది. దేశ వ్యాప్తంగా 4139 అసెంబ్లీ సీట్ల‌లో బీజేపీ కేవ‌లం 1516 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాటిలో 950 మంది ఎమ్మెల్యేలు కేవ‌లం గుజరాత్‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క‌, యూపీ, మ‌ధ్య‌ప్ర‌దేశ్ , రాజ‌స్థాన్ నుంచి ఉన్నారు. ఈ లెక్క‌ల‌ను బేరీజు వేసుకుని చూస్తే 66శాతం సీట్ల‌ను 2014 నుంచి కోల్పోయింది. సో..దేశంలో బీజేపీ వేవ్ అనేది ఉత్త‌మాట‌. ఇదే అంశాన్ని ఫోక‌స్ చేయ‌డానికి కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం అవుతోంది. ఆ స‌మావేశంలో ఇలాంటి నిజాలపై చ‌ర్చించిన త‌రువాత ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తోంది. కానీ, జీ 23 నేత‌లు ఏమి చేస్తారో..చూద్దాం.!