పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్‌గా సీవీ ఆనంద బోస్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతర రాష్ట్ర మంత్రులు, స్పీకర్ బిమన్ బెనర్జీ సమక్షంలో కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాశ్ శ్రీవాస్తవ ఆయనతో ప్రమాణం చేయించారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం గమనార్హం. 1977 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి బోస్. నవంబర్ 17న పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్‌గా నియమితులయ్యారు. లా గణేశన్ స్థానంలో ఆయన గవర్నర్‌గా నియమితులయ్యారు. బోస్ 2011లో పదవీ విరమణ చేసే ముందు కోల్‌కతాలోని నేషనల్ మ్యూజియం నిర్వాహకుడిగా పనిచేశారు.
Bengal Governor : బెంగాల్ గవర్నర్ గా బోస్

Bose Bengal