Site icon HashtagU Telugu

AAP: 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర.. ఢిల్లీలో ఆప్ విజయం..!

Delhi AAP Aam Aadmi Party

Delhi Aap

ఎంసీడీ (NDA) ఎన్నికల కౌంటింగ్ (MCD Polls Couting) పూర్తయింది. ఆప్ ఆద్మీ పార్టీ (AAP) విజయభేరి (Victory) మోగించింది. మొత్తం 250 వార్డులకు గాను 134 వార్డులు గెలుచుకుని విజయాన్ని కైవసం చేసుకుంది. 15 ఏళ్ల పాటు ఎంసీడీలో అధికారంలో ఉన్న బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. 104 సీట్లు దక్కించుకుని మెజారిటీకి దూరంగా నిలిచిపోయింది. కాంగ్రెస్ పార్టీ 9 చోట్ల గెలుపొందగా, ఇండిపెండెంట్లు నలుగురు విజయం సాధించారు.

ఎంసీడీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి విజయం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలకు ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఆప్‌ను గెలిపించడం ద్వారా దేశ వాసులకు ఢిల్లీ ప్రజలు చక్కటి సందేశం ఇచ్చారని అన్నారు. ఢిల్లీని మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దేందుకు బీజేపీ, కాంగ్రెస్ సహకరించాలని ఆయన కోరారు. మెరుగైన ఢిల్లీ కోసం కేంద్రానికి అప్పీల్ చేస్తున్నానని, ప్రధానమంత్రి ఆశీస్సులు తాను కోరుకుంటున్నానని చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ మార్క్‌ (126 సీట్లు)ను దాటి విజయం ఖాయం చేసుకోవడంతో ఆ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ”ఆప్ నేతలను నిందిస్తూ, విష ప్రచారం సాగించిన వారికి ఢిల్లీ ప్రజలు గట్టి సమాధానం చెప్పారు” అని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న ఆప్‌కు పట్టం కట్టారని అన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అధికారం నుంచి దూరం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ప్రపంచంలో అత్యంత సుందరమైన నగరంగా తాము తీర్చిదిద్దుతామని చెప్పారు.

Also Read:  Border Issue: కర్ణాటకకు మధ్య మహారాష్ట్ర ముదిరిన సరిహద్దు వివాదం..!