Site icon HashtagU Telugu

Pak Spy : పాక్ గూఢచారిగా ఆ సీఆర్పీఎఫ్‌ జవాన్‌.. ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే డ్యూటీ

Pahalgam Attack

Pahalgam Attack

Pak Spy : పెద్దసంఖ్యలో పాకిస్తాన్ గూఢచారులు అరెస్టు అవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా  సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్‌)లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై)గా పనిచేస్తున్న మోతీ రామ్‌ జాట్‌‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. అతడు పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి జరగడానికి ముందు.. మోతీ రామ్‌ జాట్‌‌ పహల్గాంలోనే డ్యూటీ చేసినట్లు తేలింది. ఉగ్రదాడి జరగడానికి ఆరు రోజుల ముందే అతడు అక్కడి నుంచి బదిలీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు మోతీ రామ్‌‌ను విచారిస్తున్నారు. అతగాడు 2023 సంవత్సరం నుంచి దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేస్తున్నట్లు తేలింది.

Also Read :Vijayasai Reddy Vs Jagan: అవసరమైతే నారా లోకేశ్, చంద్రబాబులను కలుస్తా.. విజయసాయిరెడ్డి ట్వీట్

మోతీ రామ్‌ ఏమేం చేశాడంటే.. 

ఆన్‌లైన్‌లో మోతీ రామ్‌ జాట్‌‌  యాక్టివిటీ అనుమానాస్పదంగా ఉండటంతో.. గత కొంతకాలంగా అతడి సోషల్ మీడియా కార్యకలాపాలపై సీఆర్పీఎఫ్‌ నిఘా పెట్టింది. సోషల్‌ మీడియాలో పాకిస్తానీ ఐఎస్ఐ హ్యాండ్లర్లతో మోతీరామ్‌ సంప్రదింపులు జరిపేవాడని విచారణలో వెల్లడైంది. వారి నుంచి మోతీ రామ్‌‌(Pak Spy) రూ.లక్షల్లో ముడుపులు పుచ్చుకున్నాడని, ఆ డబ్బులను తన  భార్య బ్యాంకు ఖాతాకు పంపాడని తేలింది. భారత సైనిక దళాల సీక్రెట్‌ ఆపరేషన్లు, భద్రతా మోహరింపుల సమాచారాన్ని అతడు పాకిస్తాన్‌కు చేరవేసినట్లు తేటతెల్లమైంది.

Also Read :Formula E Case : ఫార్ములా – ఈ రేస్ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కవిత ట్వీట్

నాలుగు రోజులు కఠిన విచారణ 

మోతీరామ్‌ గూఢచర్య వ్యవహారాలపై నిర్ధారణకు వచ్చిన  వెంటనే, అతడిని సీఆర్‌పీఎఫ్ దళాలు నాలుగు రోజుల పాటు కఠినంగా విచారించాయి. అనంతరం  సీఆర్పీఎఫ్‌ సర్వీసు నుంచి తొలగించారు. మే 21న మోతీ రామ్‌‌ను   ఎన్‌ఐఏకు అప్పగించారు. ఇప్పుడు ఎన్‌ఐఏ అతడిని దర్యాప్తు చేస్తోంది.పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న పలువురిని ఇటీవలే పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులతో ఉత్తర భారత దేశంలో చాపకింద నీరులా పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్న స్పై నెట్‌వర్క్‌ బండారం బయటపడింది. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన వాళ్లంతా డబ్బుకు అమ్ముడుపోయిట్లు విచారణలో తేలింది.