Flights Cancelled : పైలెట్ల స‌మ్మె, విమానాల ర‌ద్దు

పైలట్లు జీతం పెంపుకోసం ఒకరోజు సమ్మెకు దిగ‌డంతో జర్మన్ కు చెందిన‌ లుఫ్తాన్సా విమానాలు ర‌ద్దు అయ్యాయి.

  • Written By:
  • Publish Date - September 2, 2022 / 02:25 PM IST

పైలట్లు జీతం పెంపుకోసం ఒకరోజు సమ్మెకు దిగ‌డంతో జర్మన్ కు చెందిన‌ లుఫ్తాన్సా విమానాలు ర‌ద్దు అయ్యాయి. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో వందలాది మంది నిరసనలు తెలుపుతున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమానాలు రద్దు కావ‌డంతో విమాన ఛార్జీలను వాపసు చేయాలని ప్ర‌యాణీకులు డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. విమానాశ్రయం వద్ద ఢిల్లీ పోలీసులు, CISF ప్రయాణికులను శాంతింపజేశారు.

ఎయిర్‌లైన్ కంపెనీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది. ఫ్రాంక్‌ఫర్ట్ , మ్యూనిచ్‌లకు వెళ్లే ప్రయాణీకులు, చెకింగ్-ఇన్ ఏరియా వెలుపల 6 మరియు 7 వద్ద నిరసన తెలిపారు. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా శుక్రవారం నాడు 800 విమానాలను రద్దు చేసింది. దీంతో 130,000 మంది ప్రయాణికులపై స‌మ్మె ప్ర‌భావం ప‌డింది. విమానాల రద్దు ఫ్రాంక్‌ఫర్ట్ మరియు మ్యూనిచ్ విమానాశ్రయాలపై ప్రభావం చూపుతుందని లుఫ్తాన్స తెలిపింది.