Supreme Court : కేజ్రీవాల్​కు మినహాయింపు ఇవ్వలేదు.. బెయిల్ మంజూరు​పై ‘సుప్రీం’ క్లారిటీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసే విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదని సుప్రీం కోర్టు తెలిపింది.

Published By: HashtagU Telugu Desk
Aam Aadmi Party PAC meeting today evening

Aam Aadmi Party PAC meeting today evening

Supreme Court : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసే విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఇవ్వలేదని సుప్రీం కోర్టు తెలిపింది. తమ తీర్పు స్పష్టంగా ఉందని, తాము న్యాయం అనుకున్న విషయాన్నే తీర్పులో ఇచ్చామని స్పష్టం చేసింది. తాము ఇచ్చిన తీర్పుపై విమర్శనాత్మక విశ్లేషణలను స్వాగతిస్తున్నామని సుప్రీంకోర్టు బెంచ్ కామెంట్ చేసింది.  ఈ అంశంపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్ (ఈడీ)​, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ తరఫు న్యాయవాది వాదనలను వినేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్​ సంజీవ్​ ఖన్నా, జస్టిస్​ దీపాంకర్ దత్తాలతో కూడిన  ధర్మాసనం నో చెప్పింది.  ఇటీవల ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్​ చేసిన వ్యాఖ్యలపై ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్​ తుషార్​ మెహతా అభ్యంతరం వెలిబుచ్చారు. ప్రజలంతా ఆప్​నకు ఓటేస్తే, తాను తిరిగి జైలుకు వెళ్లనంటూ కేజ్రీవాల్​(Supreme Court) చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు.

We’re now on WhatsApp. Click to Join

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. ‘‘అది ఆయన ఊహ. దానిపై మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోం’’ అని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది.  సీఎం కేజ్రీవాల్ తరఫున న్యాయవాది అభిషేక్​ సింఘ్వీ వాదన వినిపిస్తూ.. ‘‘దీనిపై మేం అఫిడవిట్ దాఖలు చేస్తాం. కేజ్రీవాల్​ ఆ కోణంలో వ్యాఖ్యలు చేసి ఉంటారని నేను అనుకోవడం లేదు. కేజ్రీవాల్‌కు మినహాయింపులు ఇచ్చారనే వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర హోం మంత్రిపైనా అఫిడవిట్​ దాఖలు చేస్తాను’’ అని సుప్రీంకోర్టు ధర్మసనానికి తెలిపారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ ఈ నెల 10న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌‌ను మంజూరు చేసింది.

Also Read :Kavitha : ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌..సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు

ఎన్నికల్లో ఆప్‌ గెలిస్తే తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం రాదని కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టును ధిక్కరించేలా ఉన్నాయని  అమిత్‌ షా ఇటీవల మండిపడ్డారు. ఏదైనా కేసులో దోషులుగా ఉన్నవారు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. దోషులుగా తేలినవారిని న్యాయస్థానం జైలుకు పంపదని చేప్పేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించారని కేంద్ర హోంమంత్రి మండిపడ్డారు.  బెయిల్‌ను కేజ్రీవాల్ ఎలా ఉపయోగించుకుంటున్నారో  మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలని ఆయన సూచించారు.

Also Read :AP : ఈసీ ఎదుట హాజరైన ఏపీ సీఎస్, డీజీపీ

  Last Updated: 16 May 2024, 05:30 PM IST