UP: భాధ్యతారహిత ప్రభుత్వాలతో ప్రజలే జాగ్రతగా ఉండాలి

  • Written By:
  • Publish Date - December 30, 2021 / 03:42 PM IST

దేశంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. గత రెండు రోజుల్లో కేసులు రెండింతలు పెరగటం చూస్తే మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉన్నటు నిపుణులు చెబుతున్నారు. కానీ మన రాజకీయ నాయకులు మాత్రం ఫిబ్రవరిలో అయిదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను మాత్రం వాయిదా వేయలేమంటున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ పై బుధవారం యూపీలోని రాజకీయ పార్టీలను తమ అభిప్రాయాన్ని తెలపాలని ఎన్నికల కమిషన్ కోరగా.. అని పార్టీలు కూడా ఎన్నికలను యధావిధిగా నిర్వహించాలని కోరాయి. ఈ ఒక్క విషయంతో వారికీ సమాజం పట్ల ఉన్న బాధ్యత ఎంతో అర్ధం అవుతుంది.

ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున సభలు ర్యాలీలు నిర్వహించి ఎన్నికల వాతావరణాన్ని రెండు నెలల ముందే తీసుకువచ్చారు. ఒకసారైతే పొద్దున భారీ ఎత్తున సభ నిర్వహించి సాయంత్రం కోవిడ్ నియంత్రణ పై రాష్ట్ర ముఖ్యమంత్రులకు సూచనలు చేయడంతో అందరూ నోరెళ్లబెట్టారు. ఇలా ప్రధాని పదవిలో ఉండి ఇలాంటి సమయాల్లో మిగతావారికి ఆదర్శనంగా ఉండవలిసిందిపోయి భారీ ఎత్తున సభలు నిర్వహించి వైరస్ వ్యాప్తికి సహకరించడం ఎంతవారు కరెక్ట్ అంటారు.

బెంగాల్ ఎన్నికల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఇదే పొరపాటు చేసి అనేక మంది ప్రాణాలు బలి తీశారు. ఇప్పుడు అత్యంత జనాభా కలిగిన యూపీ పరిస్థితి తలచుకుంటేనే ఆందోళన కలుగుతుంది. రెండో వేవ్ లో ఒక ఉత్తర్ ప్రదేశ్ లోనే రోజుకు వైల సంఖ్యలో జనం ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇటీవలే ప్రభుత్వం మాత్రం ఆక్సిజన్ లేకుండా యూపీలో ఒక్కరు కూడా మరణించలేదని నివేదిక ఇచ్చింది. రెండో వేవ్ సమయం లో ఆక్సిజన్ లేదని ఎవరైనా అంటే జైలు లో వేస్తాం అని సాక్షాత్తు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

ఎన్నికల సభల్లో భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదు. జనం ఎక్కువ సంఖ్యల్లో ఉంటారు కాబట్టి వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించని నేపథ్యంలో ప్రజలే అప్రమతంగా ఉంది జాగ్రత్తలు పాటించాలి.