Site icon HashtagU Telugu

Covid Cases: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు!

Corona Update India

Corona Update India

దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. క్రమేపీ క్రియాశీల కేసులు 21 వేల మార్కు దాటాయి. పాజిటివిటీ రేటు ఒకశాతానికి చేరువైంది. కేరళలో 1,370, మహారాష్ట్రలో 1,045 మంది వైరస్ బారినపడ్డారు. ఆ రెండు రాష్ట్రాల్లోనే రెండు వేలకు పైగా కేసులున్నాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. నిన్న 19 వేలకు పైగా ఉన్న బాధితుల సంఖ్య.. ఒక్కసారిగా 21,177 (0.05 శాతం)కు ఎగబాకింది. 24 గంటల వ్యవధిలో 2,363 మంది కోలుకున్నారు. 10 మంది మరణించారు. మొత్తం కేసులు 4.31 కోట్లకు పైగా ఉండగా.. అందులో రికవరీల వాటా 98.74 శాతంగా కొనసాగుతోంది. నిన్న 12.05 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 193 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.