Site icon HashtagU Telugu

Covid Cases : ప్రస్తుతం దేశంలో కరోనా కొత్త కేసులివే!

కరోనా సెకండ్ వేవ్ దాదాపుగా కనుమరుగైనట్టే.. ఇక వ్యాక్సిన్ రెండు డోసుల ప్రక్రియ కూడా దాదాపు కంప్లీట్ అవుతోంది. అంతా సేఫ్ అనుకుంటున్న తరుణంలో ఓమిక్రాన్ రూపంలో కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. మొదట విదేశాల్లో వెలుగుచూసినా ఈ వేరియంట్.. మననదేశంలో వ్యాపించకపోవచ్చు అని అనుకున్నారంతా.. కానీ దగ్గరనే ఉన్నా బెంగళూరులో రెండు కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరిగాయా? తగ్గాయా? అనే సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య ఇలా ఉంది.

దేశంలో కొత్తగా 9,216 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.  99,976 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. నిన్న క‌రోనా నుంచి 8,612 మంది కోలుకున్నారు. ఇప్పటివ‌ర‌కు మొత్తం 3,40,45,666 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. క‌రోనాతో నిన్న 391 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,70,115కి చేరుకుంది.

బెంగళూరు ఓమిక్రాన్ వెలుగుచూడటంతో తెలంగాణ గవర్నమెంట్ అలర్ట్ అయ్యింది. మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకుంటే వెయ్యి ఫైన్ విధిస్తూ హెచ్చరికలు జారీ చేసింది. కాగా శుక్రవారం హైదరాబాద్ పోలీసులు పలుచోట్లా డ్రైవ్ లు నిర్వహిస్తూ.. మాస్కులు ధరించని జనాలకు వెయ్యి ఫైన్ విధించారు.