Site icon HashtagU Telugu

Vietnam Crisis : వియ‌త్నంపై చైనా వాణిజ్య వేటు

అమెరికా ప‌క్షాన నిలుస్తోన్న వియ‌త్నాం వాణిజ్యాన్ని నిలిపిస్తూ చైనా నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ 19 క్ర‌మంలో స‌రిహ‌ద్దుల‌ను చైనా మూసివేసింది. వియ‌త్నాంలోని లావో కై ప్రావిన్స్ లోని స‌రిహ‌ద్దు గేటు వ‌ద్ద వాణిజ్యాన్ని ర‌ద్దు చేసింది. వందలాది కంటైనర్ ట్రక్కులు స‌రిహ‌ద్దు వ‌ద్ద నిలిచిపోయాయి.వియత్నామీస్ మీడియా ప్రకారం, వ్యవసాయం, అటవీ మరియు మత్స్య ఉత్పత్తులను చైనాకు వియ‌త్నాం ఎగుమ‌తి చేస్తోంది. చైనా దేశాన్ని అతిపెద్ద మార్కెట్ గా వియత్నాం భావిస్తోంది. ఆ దేశానికి రెండ‌వ అతి పెద్ద ఎగుమ‌తిదారుగా ఉంది. రెండవ అతిపెద్ద ఎగుమతి మార్కెట్ చైనా. నవంబర్ 2021లో USD 8 బిలియన్లకు పైగా ఎగుమతి టర్నోవర్‌ను వియ‌త్నాంకు ఉంది. ఇది వియత్నాం యొక్క మొత్తం వ్యవసాయ ఎగుమతులలో 19.2 శాతం అని నివేదించింది. హెకౌ యావో అటానమస్ కౌంటీ యొక్క COVID-19 లాక్‌డౌన్‌ను అనుసరించి, ట్రక్కులు చైనా సరిహద్దును దాట‌లేక‌పోతున్నాయి.వియత్నాం పరిశ్రమ మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ నష్టాలను నివారించడానికి ఎగుమ‌తిదారుల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. సరిహద్దు పరిస్థితిని ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను అనుస‌రించాల‌ని సూచించింది.గత సంవత్సరం, చైనా ‘జీరో కోవిడ్’ విధానాన్ని అనుసరించింది. ఫ‌లితంగా హనోయ్‌తో వాణిజ్యాన్ని పరిమితం చేసింది. గ‌త వారం, లాంగ్ సన్ అనే మరో ప్రావిన్స్‌లో దాదాపు 2,000 ట్రక్కులు క్యూలో నిలిచాయి.