పిల్లలకు గుడ్ న్యూస్.. త్వరలోనే వ్యాక్సిన్

కరోనా మహమ్మారి పెద్దలు, యువతనే కాకుండా.. పిల్లలపై ప్రభావం చూపింది. హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు కొవిడ్ భయంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది.

  • Written By:
  • Publish Date - October 12, 2021 / 04:27 PM IST

కరోనా మహమ్మారి పెద్దలు, యువతనే కాకుండా.. పిల్లలపై ప్రభావం చూపింది. హాయిగా ఆడుకోవాల్సిన పిల్లలు కొవిడ్ భయంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. ఏంచేయాలో తెలియక మొబైల్స్ గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేశారు. అయితే కొవిడ్ పిల్లలకు సోకినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని చెప్పాలి. పిల్లలకు సైతం టీకా వేయాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకున్నప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో భారత్ బయోటెక్ కంపెనీ ఓ గుడ్ న్యూస్ అందించింది.

కరోనా కట్టడి కోసం భారత్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు ఇచ్చింది. 2-18 ఏళ్ల వారికి కోవాగ్జిన్ టీకా వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్లపై ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈమేరకు అనుమతులు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు వారిపై కోవాగ్జిన్‌ 2,3వ దశ ట్రయల్స్‌ని సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేసింది భారత్‌ బయోటెక్‌. ఇటీవలే రెండు, మూడో దశ ట్రయల్స్ ఫలితాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 2, 3 దశల్లో 20 రోజుల గ్యాప్‌తో రెండు డోసుల వ్యాక్సిన్‌ను దాదాపు 525 మంది చిన్నారులపై ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ‘‘పూర్తి చర్చల అనంతరం ఈ కమిటీ 2-18 ఏళ్ల చిన్నారులకు అత్యవసర పరిస్థితుల్లో పరిమిత వినియోగం కింద కోవాగ్జిన్‌ ఇచ్చేందుకు భారత్‌ బయోటెక్‌ కంపెనీకి అనుమతులిచ్చాం” అని ఒక ప్రకటనలో తెలిపింది. తర్వలోనే పిల్లలకు సైతం వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది.

కరోనా సెకండ్ వేవ్ వల్ల పెద్దలు, సీనియర్ సిటిజన్స్ చనిపోయినప్పటికీ, పిల్లలపై అంతగా ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా 0-5 ఏళ్ల వయసున్న పిల్లల్లో ఇమ్యూనిటీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయని డాక్టర్ల అభిప్రాయం. సెకండ్ వేవ్ లో కరోనా ప్రభావం కూడా పిల్లలపై అంతంతమాత్రమే. త్వరలోనే టీకా వస్తుండటంతో ఇన్నాళ్లు ఇళ్లకు పరిమితమైన చిన్నారులు స్వేచ్ఛగా బయట అడుగుపెట్టనున్నారు.