Site icon HashtagU Telugu

India: సుప్రీంలో పెగాసస్ విచారణపై మమతాకు షాక్

Cac7decc 9508 42c0 Ba18 Eba27a100964 Background Imresizer

mamta banerjee

పెగాసస్ విచారణలో మరో మలుపు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ కొనసాగించకుండా శుక్రవారం స్టే విధించిన సుప్రీం కోర్టు. భారత్ లో సుమారు 300 మంది ప్రముఖుల ఫోన్లు పెగాసస్ స్పైవెర్ తో హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తో పాటు ప్రముఖ న్యాయమూర్తులు, పాత్రికేయులు, రాజయాకియ నాయకులు, కేంద్ర మంత్రులు బాధితులుగా ఉన్నారు. ఇస్రేల్ స్పైవెర్ పెగాసస్ ను ఆ సంస్థ కేవలం దేశ ప్రభుత్వాలకే విక్రయిస్తుందని ప్రకటించిన నేపథ్యం లో కేంద్ర ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు రాగ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ రమణ ముగ్గురు సైబర్ నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు.

గత అక్టోబర్ 27న పశ్చిమ బెంగాల్ లోని త్రిణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎం.బి లోకుర్ అధ్యక్షతన ఓ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఓ కమిటి విచారణ ఇదివరకే జరుపుతునందు వలన కమిటీని రద్దు చేస్తున్నట్లు మమతా ప్రభుత్వం సుప్రీం ద్రుష్టి కి తెచ్చింది. కానీ..సదరు కమిషన్ ఇంకా విచారణ కొనసాగిస్తుందని గ్లోబెల్ విల్లెజ్ ఫౌండషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్చంధ గురువారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వీ రమణ, జస్టిస్ హేమకాంత్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టి కమిషన్ పై విధించింది.