Site icon HashtagU Telugu

కరోనా ఎఫెక్ట్.. క్రిస్మస్, న్యూ ఇయర్ కు కోవిడ్ ఆంక్షలు!?

7939fff816e5c4f20e362e783152be4c1671640026190320 Original

7939fff816e5c4f20e362e783152be4c1671640026190320 Original

ప్రస్తుతం కరోనా వైరస్ చైనాతో పాటూ ఇతర దేశాల్లో పెరుగుతూ వస్తుంది. అయితే ఈ సందర్భంగా భారత్లో క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు కోవిడ్ పరిమితులు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. అలాగే తాజాగా ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈయనకు ప్రకటన చేశారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సైతం త్వరలోనే కోవిడ్ ఆంక్షలు విధించే దిశగా అధికారులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది..

ప్రపంచవ్యాప్తంగా మల్లి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలకు భారత్ లో కోవిడ్ పరిమితులు విధించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రులతో సమావేశం ఏర్పాటు కానున్నట్టు తెలుస్తోంది.. ఈ విషయంపై ఇప్పటికే లోక్సభలో మాట్లాడిన ఆరోగ్య శాఖ మంత్రి మనసుఖ్ మాండవియ తాజాగా కీలక ప్రకటన చేశారు.. అలాగే ప్రస్తుతం చైనా ఇతర దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులను భారత్లో కట్టడి చేయటానికి ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అలాగే ఇప్పటికే దేశవ్యాప్తంగా అందరికీ టీకాలు అందించామని అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు ధరించాలని తెలిపారు అలాగే నరేంద్ర మోడీ ఏర్పాటు చేయనున్న సమావేశంలో రాష్ట్రాలకు కొన్ని ఆదేశాలు కేంద్రం జారీ చేయనున్నట్లు తెలుస్తోంది..

ఇందులో బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలకు హాజరైన వాళ్లు ఫేస్ మాస్క్, సామాజిక దూరం వంటి ప్రోటోకాల్ పాటించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది..
తరచూ చేతులు తరచుగా శానిటైజ్ చేయడం.. నూతన సంవత్సర వేడుకలకు బహిరంగ ప్రదేశాల్లో రద్దీని నివారించడం.. సామాజిక దూరాన్ని పటించేటట్లు చేయటం వంటి మార్గదర్శకాలను కూడా జారీ చేయవచ్చు. అలాగే విమానాశ్రయాలలో పరీక్ష, ట్రేసింగ్ తప్పనిసరి చేసే అవకాశం ఉంది. వచ్చే వారంలో దేశంలో క్వారంటైన్, టెస్టింగ్ కోసం సౌకర్యాలు మళ్లీ ఏర్పాటు చేయబడతాయని సమాచారం..