గత ఐదేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన కరోనా (Corona) మహమ్మారి మరోసారి ఉధృతంగా తిరిగొస్తోంది. తాజాగా ఆసియా ఖండంలోని సింగ్‌పూర్, హాంకాంగ్, చైనా దేశాల్లో కొత్త వేరియంట్లు వెలుగులోకి వచ్చాయి. వాటి ప్రభావం భారత్‌పైనా చూపిస్తోంది. గత వారం నుండి దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియన్ కోవిడ్ జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) తాజా నివేదిక ప్రకారం.. ఒమిక్రాన్‌కు చెందిన రెండు కొత్త వేరియంట్లు భారత్‌లో గుర్తించబడ్డాయి. దేశవ్యాప్తంగా 1,009 యాక్టివ్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో ఒక్క వారం వ్యవధిలోనే 100కి పైగా కొత్త కేసులు వచ్చాయి.
AP Govt : వైఎస్సార్ జిల్లా పేరు మారుస్తూ జీవో జారీ
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే కేరళ 430 కేసులతో మొదటిస్థానంలో ఉంది. మహారాష్ట్రలో 209, ఢిల్లీలో 104, గుజరాత్‌లో 83, కర్ణాటకలో 47, ఉత్తరప్రదేశ్‌లో 15, పశ్చిమ బెంగాల్‌లో 12 కేసులు నమోదు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు కేసులు నమోదు కాగా, అండమాన్ నికోబార్, బిహార్, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదు. కాగా మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువమందికి మునుపటి నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈసారి వ్యాప్తికి ప్రధాన కారణంగా జేఎన్ 1 వేరియంట్‌ను భావిస్తున్నారు. ఇది ఒమిక్రాన్ బీఏ.2.86 వేరియంట్ నుంచి పుట్టిన కొత్త రూపం. ఇది గత వేరియంట్లతో పోలిస్తే వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉంది. అయితే వైద్య నిపుణులు.. ఆరోగ్య అధికారులు ఆందోళన అవసరం లేదంటున్నారు. చాలా మందిలో తేలికపాటి లక్షణాలే ఉండటం, మరణాలు కూడా ఇతర ఆరోగ్య సమస్యల వలన జరుగుతున్నట్లు వారు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించడం ఉత్తమమని సూచిస్తున్నారు.