Site icon HashtagU Telugu

COVID-19: మళ్లీ కరోనా కలకలం.. 4 నెలల గరిష్టానికి కేసులు.. ఒకేరోజు 841 మందికి ఇన్ఫెక్షన్

Corona COVID-19 Chaos Again.. Cases At The Maximum Of 4 Months.. 841 People Infected In One Day

Corona Chaos Again.. Cases At The Maximum Of 4 Months.. 841 People Infected In One Day

భారతదేశంలో రోజువారీ కరోనా కేసులు 800 దాటాయి. గత 4 నెలల్లో ఇదే అత్యధికం. దేశంలో గత 24 గంటల్లో 841 కరోనా ఇన్ఫెక్షన్‌లతో, యాక్టివ్ కేసుల సంఖ్య 5,389కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశం యొక్క కరోనా కేస్ లోడ్ 4.46 కోట్లకు (4,46,94,349) పెరిగింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ లలో అత్యధికంగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయని గణాంకాలను బట్టి తెలుస్తోంది. భారతదేశంలో రోజువారీ సగటు కరోనా కేసులు నెలలో ఆరు రెట్లు పెరిగాయి. ఒక నెల క్రితం (ఫిబ్రవరి 18) సగటు రోజువారీ కొత్త కేసులు 112 కాగా, ఇప్పుడు (మార్చి 18) వాటి సంఖ్య 626కు పెరిగింది. యాక్టివ్ కరోనా కేసులు ఇప్పుడు మొత్తం కొవిడ్ ఇన్ఫెక్షన్‌లలో 0.01 శాతం ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. జాతీయ COVID-19 రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,58,161కి పెరిగింది. కొవిడ్ మరణాల రేటు 1.19 శాతంగా ఉంది.ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 5 లక్షల 30 వేల 799 మంది కరోనాతో మరణించారు.

ఇక ఆకస్మికంగా పెరుగుతున్న వైరల్ ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించడంపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వం 6 రాష్ట్రాలకు లేఖ రాసింది.  మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ రాశారు. వైద్య పరీక్షలు, చికిత్స, ట్రాకింగ్ మరియు టీకాలు వేయడంపై దృష్టి సారించాలని కోరారు.కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయని ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. కాగా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 220.64 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్ ఇవ్వబడింది.

Also Read:  She Shuttle Bus: హైదరాబాద్ లో మొదలైన షీ షటిల్ బస్సు సర్వీస్.. మహిళలకు ఉచిత ప్రయాణం