Corona: రికార్డు స్థాయిలో లక్షకు పైగా కేసుల నమోదు!

  • Written By:
  • Updated On - January 19, 2022 / 04:19 PM IST

దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. దాదాపు ఏడు నెలల తర్వాత దేశంలో తొలిసారి గురువారం లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి, బుధవారం 90,928 కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. బుధవారం నటితో పోలిస్తే ఇది 28.8 శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కేసులు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర (36,265) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (15,421), ఢిల్లీ (15,097), తమిళనాడు (6,983), కర్ణాటక (5,031) రాష్ట్రాలు ఉన్నాయి.

అలాగే, గత 24 గంటల్లో 302 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు కొవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 4,83,178కి పెరిగింది. తాజా మరణాల్లో అత్యధికంగా కేరళలో 221 కేసులు నమోదు కాగా, పశ్చిమ బెంగాల్‌లో 19 మంది మరణించారు. ఇక, రికవరీ రేటు 97.57 శాతంగా ఉంది.