Corona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, తాజా కేసులు ఎన్నంటే!

Corona: తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులో దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,565కి పెరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే దేశంలో కరోనా వేరియంట్ల కారణంగా ఇద్దరు చనిపోయారు. హర్యానాలో ఒకరు చనిపోగా.. కర్ణాటకలో మరొకరు మృతిచెందారు. దాంతో.. ఇప్పటి వరకు కరోనా కారణంగా దేశంలో […]

Published By: HashtagU Telugu Desk
New COVID Variant

Corona Turmoil Again.. Are The States Ready..

Corona: తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులో దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,565కి పెరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే దేశంలో కరోనా వేరియంట్ల కారణంగా ఇద్దరు చనిపోయారు. హర్యానాలో ఒకరు చనిపోగా.. కర్ణాటకలో మరొకరు మృతిచెందారు. దాంతో.. ఇప్పటి వరకు కరోనా కారణంగా దేశంలో చనిపోయినవారి సంఖ్య 5,33,366కి పెరిగింది.

కాగా.. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,76,550గా ఉంది. మరోవైపు దేశంలో ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ జేఎన్‌-1 రకం కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ రకం వేరియంట్‌ వ్యాప్తి దేశంలో వేగంగా ఉందనీ.. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక సోమవారం కూడా దేశంలో 196 జేఎన్‌-1 రకం కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. అత్యధికంగా కేరళలో 83లో కేసుల ఉండగా,  తెలంగాణ 2 ఉన్నాయి.

  Last Updated: 02 Jan 2024, 12:23 PM IST