Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. మళ్లీ పెరుగుతున్న కేసులు!

 దేశంలో ఉన్నట్టు ఉండి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 01:44 PM IST

Covid Cases: దేశంలో ఉన్నట్టు ఉండి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 కారణంగా ఇటీవల కేరళలో ఒకరు చనిపోయారు. ఇక దేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం 1,828 కేసులు వెలుగు చూశాయి. కోలుకున్న వారి సంఖ్య 4.46 కోట్లకు (4,44,69,931) పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇప్పటివరకు కోవిడ్ -19 కారణంగా 5,33,317 మంది మరణించారు. కేసు మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. నిన్న భారతదేశం లో 335 తాజా కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లను నమోదు అయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 1,701 కు పెరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇక కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనుగొనబడిన కోవిడ్ -19 సబ్-వేరియంట్ JN.1 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నెలరోజుల క్రితం సింగపూర్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ చేయబడిన కొంతమంది భారతీయులలో ఈ వేరియంట్ కనుగొనబడింది. కేరళ లో ఈ వేరియంట్‌ను గుర్తించామని ఆయన చెప్పారు. మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అలర్ట్ అయ్యారు.

Also Read: Hyderabad: హైదరాబాద్ లో మహిళపై గ్యాంగ్ రేప్, నలుగురు యువకులు అరెస్ట్