Site icon HashtagU Telugu

Akhand Bharat-Mural : కొత్త పార్లమెంట్ లో అఖండ భారత్ మ్యాప్.. నేపాల్ లో దుమారం

Akhand Bharat Mural

Akhand Bharat Mural

Akhand Bharat-Mural : కొత్త పార్లమెంట్‌లోని ఒక కుడ్యచిత్రం (Mural) హాట్ టాపిక్ గా మారింది..    

దానిపై పలువురు నేపాలీ రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు..  

ఆ కళాఖండాన్ని ఇండియా పార్లమెంట్ నుంచి  తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు..  

ప్రస్తుతం ఇండియా టూర్ లోనే ఉన్న నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ఈవిషయాన్ని భారత సర్కారుకు తెలియజేయాలని వారు కోరుతున్నారు. 

ఇంతకీ ఏమిటా కుడ్యచిత్రం(Mural).. ? ఎందుకీ దుమారం ? ఇప్పుడు తెలుసుకుందాం.. 

మన కొత్త పార్లమెంట్ లో ఏర్పాటైన ఒక కుడ్యచిత్రంలో మౌర్య రాజవంశపు మూడో  చక్రవర్తి అశోకుడు ఏలిన సామ్రాజ్యం మ్యాపింగ్ ఉంది. అశోకుని సామ్రాజ్యం పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుంచి తూర్పున బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉండేది. కేరళ, తమిళనాడు, శ్రీలంక మినహా దాదాపు మొత్తం భారత ఉపఖండం ఈ  మ్యాప్ లో ఉంది. ఇందులో ఉత్తరాన తక్షశిల, వాయవ్యంలో పురుష్‌పూర్, ఈశాన్యంలో కామ్  రూప్ ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో ఈ మొత్తం ప్రాంతాన్ని అశోకుడు ఏలాడు.  ఇందులో బుద్ధుని జన్మస్థలమైన లుంబినీ కూడా ఉంది. దీనిపైనే ఇద్దరు నేపాల్  మాజీ ప్రధానులు సహా ఎంతోమంది నేపాలీ రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు.  “భారతదేశం తనను తాను ప్రజాస్వామ్యానికి  ప్రతిబింబంగా చెబుతుంది. అలాంటి దేశం.. నేపాలీ భూభాగాలను తన మ్యాప్‌లో చూపించే కుడ్య చిత్రాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయడం  న్యాయం కాదు” అని నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ కామెంట్ చేశారు.

Also read : Pakistan New Party : ఒక బిలియనీర్ రాజకీయం.. ఇమ్రాన్ పార్టీ రెబల్స్ తో కొత్త పార్టీ

నేపాల్ కు ఇండియా ఆన్సర్ ఇదీ.. 

దీనిపై భారత ప్రభుత్వం స్పందించింది. “ఆ కుడ్యచిత్రం(Akhand Bharat-Mural) పూర్వ అశోక సామ్రాజ్యాన్ని చూపించే కళాఖండం మాత్రమే” అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు. “ఆ కుడ్యచిత్రం అశోక సామ్రాజ్యం వ్యాప్తిని.. అశోకుడి ప్రజా రంజక  పాలనను మాత్రమే అద్దం పడుతుంది”  తెలిపారు. ఈ విషయంపై నేపాల్‌లో నిరసనలు జరుగుతున్నాయో లేదో తనకు తెలియదన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీతో చర్చల సందర్భంగా నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ఈ కుడ్యచిత్రం విషయాన్ని లేవనెత్తలేదని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా వెల్లడించారు.  

Exit mobile version