Site icon HashtagU Telugu

India-Pak Border: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో నిషిద్ధ ప్యాకెట్స్ స్వాధీనం!

India pak Border

Indian Border

భారత్-పాకిస్థాన్ సరిహద్దు (India-Pak Border) మరోసారి చర్చనీయాంశమవుతోంది. రెండు దేశాల సరిహద్దు ప్రాంతమైన పంజాబ్ (Punjab) రాష్ట్రం ఫాజిల్కా జిల్లా గట్టి అజైబ్ గ్రామం వద్ద BSF దళాల తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో హెరాయిన్‌గా అనుమానిస్తున్న 4 నిషిద్ధ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు (India-Pak Border)ఫెన్సింగ్‌కు ముందు నుండి 12 అడుగుల పొడవు గల 1 PVC పైపు, 1 శాలువాతో పాటు 21 నిషేధిత ప్యాకెట్లను దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు వద్ద మోహరించిన BSF దళాలు ఈరోజు తెల్లవారుజామున ఫెన్సింగ్‌కు ఇరువైపులా స్మగ్లర్ల అనుమానాస్పద కదలికలను గమనించాయి. దట్టమైన పొగమంచు కారణంగా స్మగ్లర్లపై సైనికులు కాల్పులు జరిపారు.

ఇటీవలనే మా వ‌ద్ద అణుబాంబు ఉన్నాయ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు పాకిస్థాన్ (Pakistan Minister) మహిళా మంత్రి షాజియా మారీ..ఈ మేర‌కు భారత్ విషయంలో దుందుడుకు వ్యాఖ్యలు చేశారు. పాక్ ఒక అణ్వస్త్ర దేశం అన్న సంగతిని భారత్ గమనించాలని హెచ్చరిక చేశారు. తమ అణ్వస్త్ర హోదా మౌనంగా ఉండేందుకు కాదని, అవసరమైతే వెనుకంజ వేసే ప్రసక్తేలేదని షాజియా స్పష్టం చేశారు.

ఎలా జవాబు ఇవ్వాలో పాకిస్థాన్ (Pakistan) కు తెలుసు. చెంపమీద కొడితే ఊరికే చూస్తూ ఉండిపోదు. అదే స్థాయిలో బదులిస్తుంది. మా వద్ద అణుబాంబు ఉందన్న విషయం భారత్ మర్చిపోరాదు. భారత ప్రధాని మోదీ దేశంలో విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారు. హిందూయిజం, హిందుత్వ అంశాలు మోదీ ప్రభుత్వంలో విజృంభిస్తున్నాయి. భారత్ (India) ముస్లింలను ఉగ్రవాదంతో ముడివేస్తోంది అంటూ షాజియా మారీ మండిపడ్డారు.

Also Read: Trouble in BRS: ఎమ్మెల్యే వర్సెస్ మేయర్.. బీఆర్ఎస్ లో అంతర్గత పోరు!