అవ‌య‌వ‌దానంపై అవ‌గాహ‌న‌.. జీవ‌న్ ధాన్ ప్రొగ్రాంకు ఆద‌ర‌ణ

ర‌క్త‌దానం మాదిరిగా ఇప్పుడు అవ‌య‌వ‌దానం ఊపందుకుంది. వారం క్రితం ప్ర‌మాదంలో బ్రైన్ డెడ్ అయిన 34 ఏళ్ల కానిస్టేబుల్ అవ‌య‌వ‌దానం చేశాడు. దీంతో ప‌లువురు స్పూర్తి పొందార‌ని జీవ‌న్ ధాన్ సంస్థ చెబుతోంది. కానిస్టేబుల్ గుండెను నిమ్స్ లో చికిత్స పొందుతోన్న యువ పెయింట‌ర్ కు అమ‌ర్చిన‌ట్టు సంస్థ వెల్ల‌డించింది

  • Written By:
  • Publish Date - September 24, 2021 / 10:53 AM IST

ర‌క్త‌దానం మాదిరిగా ఇప్పుడు అవ‌య‌వ‌దానం ఊపందుకుంది. వారం క్రితం ప్ర‌మాదంలో బ్రైన్ డెడ్ అయిన 34 ఏళ్ల కానిస్టేబుల్ అవ‌య‌వ‌దానం చేశాడు. దీంతో ప‌లువురు స్పూర్తి పొందార‌ని జీవ‌న్ ధాన్ సంస్థ చెబుతోంది. కానిస్టేబుల్ గుండెను నిమ్స్ లో చికిత్స పొందుతోన్న యువ పెయింట‌ర్ కు అమ‌ర్చిన‌ట్టు సంస్థ వెల్ల‌డించింది. బ‌య‌ట అవ‌య‌వ మార్పిడికి సుమారు 25 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతోంది. కానీ, ప్ర‌భుత్వ‌, నిమ్స్ ఆస్ప‌త్రుల్లో చాలా త‌క్కువ ఖ‌ర్చుతో అవ‌య‌వ మార్పిడి చేస్తున్నారు.
జీవ‌న్ ధాన్ సంస్థ చాలా సంవ‌త్స‌రాలుగా అవ‌య‌వ‌దానంపై అవ‌గాహ‌న పెంచే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. దాత‌ల కోసం జీవ‌న్ ధాన్ ప్రొగ్రామ్ ద్వారా వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచింది. ఔత్సాహికులు వెబ్ సైట్ లో రిజిస్ట్ర‌ర్ చేసుకోవాల‌ని పిలుపు నిచ్చింది. బ్రెయిన్ డెడ్ అయిన వెంట‌నే నిమ్స్ లోని కార్డియాల‌జీ డిపార్ట్ మెంట్ కు స‌మాచారం అందిస్తే, మిగిలిన ప్రాసెస్ ను ఆస్ప‌త్రి చేస్తోంది.
జీవ‌న్ ధాన్ ప్రొగ్రామ్ ను 2013 నుంచి ప‌రిచేయం చేసిన త‌రువాత దాత‌ల సంఖ్య పెరుగుతోంది. 2018లో అత్య‌ధికంగా 573 మంది అవ‌య‌వాల‌ను దానం చేశారు. 2019లో 469 మంది దానం చేయ‌గా గ‌త ఏడాది కోవిడ్ కార‌ణంగా ఆ సంఖ్య 257కు ప‌డిపోయింది. మ‌ళ్లీ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 15 వ‌ర‌కు 379 మంది అవ‌య‌వ దానం చేశార‌ని జీవ‌న్ ధాన్ వెల్ల‌డించింది.