Site icon HashtagU Telugu

Yogi: సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర.. యోగి ఆగ్రహం

Conspiracy to damage Sanatana Dharma.. Yogi's anger

Conspiracy to damage Sanatana Dharma.. Yogi's anger

CM Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి(Ram Navami) వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

సనాతన నమ్మకాన్ని దెబ్బతీసేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ భక్తులపై దాడులు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో రామనవమి వేడుకలతో పాటు ఊరేగింపులు సజావుగా జరిగాయన్నారు. కానీ పశ్చిమ బెంగాల్ లో మాత్రం దాడులు జరిగాయని, ఇది సనాతన ధర్మాన్ని దెబ్బ తీసే కుట్ర అని ఆక్షేపించారు. ప్రధాని మోడీ నాయకత్వం, మార్గదర్శకత్వంలోని బీజేపీ దేశంలో భద్రతను మెరుగుపరిచిందని సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు.

Read Also: Pothina Mahesh : పవన్ ది బ్రాండ్ కాదు – మోసం : పోతిన మహేష్

ప్రధాని మోడీ జాతీయవాదం, అభివృద్ధి, భద్రత, సుపరిపాలన కారణంగా రాజస్థాన్‌ లో బీజేపీకి గణనీయమైన మెజారిటీ దక్కిందని సీఎం యోగి పేర్కొన్నారు. గత ఎన్నికల మాదిరిగానే రాజస్థాన్ లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీజేపీకి 25 సీట్లు దక్కాయని, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ వందశాతం సీట్లు సాధిస్తుందని ఉత్తరప్రదేశ్ సీఎం స్పష్టం చేశారు.

Read Also: Haryana : పోలీసులు పక్కనుండగానే మహిళ ఖైదీఫై..మరో ఇద్దరు మగ ఖైదీలు అత్యాచారం..

కాగా.. ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ముందస్తు ప్రణాళికతోనే ఊరేగింపుపై దాడి జరిగిందని మమతా బెనర్జీ అన్నారు. ఘటనకు పాల్పడేందుకు వీలుగా రామనవమికి ఒక రోజు ముందు ముర్షిదాబాద్ డీఐజీని తొలగించారని విమర్శించారు.