Sukesh Income : సుకేశ్ చంద్రశేఖర్ వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇతగాడు ఢిల్లీలోని ఒక జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. జైలులోనే ఉన్నా.. సుకేశ్ నిత్యం వార్తల్లోకి ఎక్కుతుంటాడు. తాజాగా అతడు జైలు నుంచి సంచలన లేఖను విడుదల చేశాడు. 2024 సంవత్సరంలో తాను విదేశీ వ్యాపారాల ద్వారా రూ.7,640 కోట్ల ఆదాయాన్ని ఆర్జించానని ప్రకటించాడు. ‘‘నాకు ఎల్ఎస్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ అనే కంపెనీ ఉంది. అది అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో రిజిస్టర్ అయింది. నా మరో కంపెనీ స్పీడ్ గేమింగ్ కార్పొరేషన్ బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రిజిస్టర్ అయిది. ఈ కంపెనీల ద్వారా నేను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో గేమింగ్, బెట్టింగ్ వ్యాపారాలు చేస్తుంటాను. అమెరికా, స్పెయిన్, బ్రిటన్, హాంకాంగ్‌లలోనూ నాకు బిజినెస్‌లు ఉన్నాయి. వాటి నుంచే 2024లో రూ.7,640 కోట్ల ఆదాయాన్ని సంపాదించాను’’ అని సుకేశ్ వెల్లడించాడు. ఈవిధంగా తనకు వచ్చిన విదేశీ ఆదాయాన్ని సంబంధిత భారత ప్రభుత్వ ఆదాయపు పన్ను పథకం కింద కవర్ చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను అతడు కోరాడు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు వాటిపై తప్పకుండా పన్నులు చెల్లిస్తానని ప్రకటించాడు.
Also Read :Sankranti Dishes Dearer : సంక్రాంతి వేళ కాగుతున్న నూనెలు.. ఉడకనంటున్న పప్పులు
‘‘ప్రధాని మోడీ(Sukesh Income) అంటే నాకు చాలా ఇష్టం. మోడీజీ నాయకత్వంలో భారతదేశానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. నాకు వచ్చిన విదేశీ ఆదాయంపై పన్ను కట్టాలని భావిస్తున్నాను. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను’’ అని సుకేశ్ వెల్లడించాడు. ‘‘నేను అండర్ ట్రయల్ ఖైదీని మాత్రమే. ఏ కేసులోనూ ఇంకా దోషిగా తేలలేదు. అందుకే నా సంపాదనను అక్రమం అని ఎవరూ చెప్పలేరు. నా ఆదాయం సక్రమమైందే. అందుకే భారత్‌లోని ఆదాయపు పన్ను విభాగం నా వ్యాపారాల నుంచి పన్ను రికవరీ ప్రక్రియను ప్రారంభించింది’’ అని లేఖలో సుకేశ్ చెప్పుకొచ్చాడు.
Also Read :Swami Vivekananda Speech : చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగానికి హైదరాబాద్‌తో లింక్.. ఏమిటి ?
‘‘భారతీయుడిగా నేను గర్విస్తున్నాను. భారత పన్ను చట్టాల ప్రకారం నడుచుకుంటాను. నా విదేశీ ఆదాయంపై భారత్‌లో పన్నులు చెల్లించడానికి సిద్ధం’’ అని అతడు తేల్చి చెప్పాడు. భారత్‌లో చేస్తున్న వ్యాపారాలపై ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను చెల్లించడానికి సిద్ధమని సుకేశ్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు భారత్‌లో తనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఆదాయపు పన్ను బకాయిలను కూడా క్లియర్ చేస్తానన్నాడు. కోట్ల రూపాయల మోసం కేసులో సుకేశ్ చంద్రశేఖర్ 2015లో అరెస్టయ్యాడు.