Site icon HashtagU Telugu

Bharat Jodo Yatra: శ్రీనగర్ లో భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం

Bharat Jodo Yatra

New Web Story Copy 2023 09 07t233649.848

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ శ్రీనగర్‌లో శాంతియుతంగా మార్చ్‌ను నిర్వహించింది. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీ మార్చ్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తారిక్ హమీద్ కర్రా నాయకత్వం వహించారు. దేశంలో మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ప్రారంభించిన జోడో యాత్రకు ఈ మార్చ్ పునరుద్ఘాటన అని కర్రా అన్నారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు రాహుల్ గాంధీని ఆపద్బాంధవుడిగా చూస్తున్నారని, వాళ్ళు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల నుండి తమను రక్షించగలరని నమ్ముతున్నారని కర్రా తెలిపారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి నేను వ్యాఖ్యానించలేను. అయితే తీర్పు మనకు అనుకూలంగా వస్తుందని జమ్మూకశ్మీర్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నాడు. భారత్ జోడో యాత్ర గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమై ఈ ఏడాది జనవరి 30న శ్రీనగర్‌లో ముగిసింది. 145 రోజుల యాత్రలో రాహుల్ గాంధీ పలువురు పార్టీ నేతలతో కలిసి 4 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు.12 బహిరంగ సభలు, 100కు స్థానిక సమావేశాలు నిర్వహించారు, 13 విలేకరుల సమావేశాలలో ప్రసంగించారు.

Also Read: Chandrababu Scam: చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ మంత్రులు