Site icon HashtagU Telugu

Congress Fourth List: 46 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ నాలుగో జాబితా విడుదల

Congress Fourth List

Congress Fourth List

Congress Fourth List: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు 46 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. రాజ్‌గఢ్ నుంచి దిగ్విజయ్ సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. ప్రధాని మోదీపై వారణాసి నుంచి యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ను బరిలోకి దింపింది. ఇమ్రాన్ మసూద్ సహరాన్‌పూర్ నుంచి, వీరేంద్ర రావత్ హరిద్వార్ నుంచి, డానిష్ అలీ అమ్రోహా నుంచి పోటీ చేయనున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ నుంచి పీఎల్ పూనియా తనయుడు తనుజా పూనియాకు పార్టీ టికెట్ ఇచ్చింది. జమ్ముకశ్మీర్ లోని ఉదంపూర్ నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పై చౌదరి లాల్ సింగ్, జమ్ము నుంచి జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ్ భల్లా. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. కాగా వచ్చే నెల 19న తొలిదశ పోలింగ్ జరుగున్నది.

Also Read: CM Ramesh: 450 కోట్ల ఫోర్జరీ కేసులో బీజేపీ ఎంపీ సీఎం రమేష్‌