Amit Shah’s Comments : అమిత్ షా రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్..మోడీ కౌంటర్

Amit Shah’s Comments : అమిత్ షా రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనతో పార్లమెంట్ కార్యకలాపాలు ఆగిపోయాయి

Published By: HashtagU Telugu Desk
Congress Protest Against Am

Congress Protest Against Am

రాజ్యసభలో బీఆర్ అంబేడ్కర్‌(BR Ambedkar)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై (Amit Shah’s Comments) కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన (Congress protest ) వ్యక్తం చేస్తుంది. ఈరోజు బుధువారం కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో అంబేడ్కర్ ఫోటోలు పట్టుకొని ‘జై భీమ్’ అంటూ నినాదాలు చేశారు. అమిత్ షా రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనతో పార్లమెంట్ కార్యకలాపాలు ఆగిపోయాయి. బిజెపి (BJP) మాత్రం ఈ నిరసనను ప్రతిపక్షాల చీప్ ట్రిక్స్‌గా కొట్టిపారేస్తూ, కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టింది. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ వారసత్వాన్ని అవమానించడానికి మరియు షెడ్యూల్డ్ కులాలు, తెగలను కించపరిచేందుకు ప్రతిపత్తి చూపించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తూ, అంబేడ్కర్‌కు అవమానం చేసినట్లు బీజేపీ ఆరోపించింది.

ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఈ వివాదంపై ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు అంబేడ్కర్ వారసత్వాన్ని తుడిచిపెట్టేందుకు, SC/STలకు అవమానాలు చేయడానికి ఎప్పుడూ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు అని అన్నారు. భారత ప్రజలు ఈ వ్యవహారాన్ని గమనిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్వినియోగాన్ని చేస్తుందో ప్రజలు చూస్తున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు సర్వశక్తులు ఒడ్డిందని తెలిపారు. SC/ST చట్టాన్ని బలోపేతం చేయడం, పేదరికాన్ని నిర్మూలించడం వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వీటితో పాటు అంబేడ్కర్‌తో అనుబంధం ఉన్న ఐదు ప్రసిద్ద ప్రదేశాలను అభివృద్ధి చేయడంలో తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని చెప్పుకొచ్చారు. అంబేడ్కర్ నివసించిన లండన్ ఇంటి స్వాధీనీకరణ, చైత్య భూమి సమస్య పరిష్కరణ వంటి చర్యలను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు.

Read Also : Congress Leaders Protest : రోడ్డు పై బైఠాయించిన సీఎం రేవంత్

  Last Updated: 18 Dec 2024, 02:16 PM IST