కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రజల్లోకి నూతన క్యాంపెయిన్‌తో అడుగుపెడుతోంది. జనవరి 3 నుంచి ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ (Jai Bapu, Jai Bhim, Jai Samvidhan) పేరిట దేశవ్యాప్తంగా ఈ ప్రచారాన్ని (Campaign ) ప్రారంభించనుంది. మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ల ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ఈ ప్రచారం ప్రారభించబోతున్నారు.
ఈ క్యాంపెయిన్ లో భాగంగా అన్ని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో భారీ ర్యాలీలను నిర్వహించనున్నారు. జనవరి 26న మధ్యప్రదేశ్‌లోని అంబేడ్కర్ స్వస్థలం మౌలో ఈ ప్రచారానికి ఘనమైన ముగింపు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దేశ ప్రజలకు గాంధీ, అంబేడ్కర్ ఆశయాలను చేరవేయడమే ప్రధాన ఉద్దేశమని పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. మొదట డిసెంబర్ 27న ఈ క్యాంపెయిన్‌ను ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అయితే, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. జనవరి 3న అధికారికంగా ప్రారంభించి, ఈ క్యాంపెయిన్లను ఆరంభిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.
ఈ ప్రచారాన్ని వచ్చే రెండేళ్ల పాటు కొనసాగించనుంది. 2026 జనవరి 26 వరకు ప్రజలకు సమాజంలోని వివిధ సమస్యలను పరిష్కరించడంలో రాజ్యాంగ ప్రాధాన్యతను తెలియజేసే కార్యక్రమాలు ఉంటాయని కాంగ్రెస్ తెలిపింది. బలమైన సందేశంతో ఈ ప్రచారం దేశ ప్రజల గుండెల్లో నిలుస్తుందని పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.
Read Also : PM Modi Govt: రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అందించిన కేంద్రం.. రూ. 1350కే ఎరువు బస్తా!