Congress Plan : ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంతగడ్డ గుజరాత్ రాష్ట్రం వేదికగా కాంగ్రెస్ గర్జించింది. ఈసారి ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలతో గుజరాత్ సహా యావత్ దేశంలోని కాంగ్రెస్ క్యాడర్‌లో జోష్ వచ్చింది. ప్రత్యేకించి ఉత్తరాది రాష్ట్రాల్లో హస్తం పార్టీ క్యాడర్‌కు ఆత్మస్థైర్యం పెరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నిజమైన వారసులు కాంగ్రెస్ నేతలే అని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గుజరాత్‌లోని బలమైన ల్యూవా పటేల్ పాటీదార్ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ వర్గం ఎటువైపు ఉంటే.. అటువైపు గుజరాత్ ఎన్నికల ఫలితాలు నిర్ణయమవుతాయి. ఇంతటి బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు ఆకట్టుకునే పనిని ఖర్గే చేశారు.
Also Read :Sadanand Date : సదానంద్ దాతే.. నాడు కసబ్‌తో ఢీ.. నేడు రాణా ఇంటరాగేషన్
నెహ్రూ, పటేల్ దోస్తీపై..
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు, సర్దార్ పటేల్‌కు ఉన్న స్నేహబంధాన్ని ఖర్గే గుర్తుచేశారు. పటేల్‌తో ఆర్ఎస్ఎస్‌కు కానీ, బీజేపీకి కానీ కించిత్తు కూడా సంబంధం లేదని ఆయన పునరుద్ఘాటించారు. మహాత్మాగాంధీ గుజరాత్(Congress Plan) వాస్తవ్యులే. దేశం గర్వించే సేవలను అందించిన మహోన్నతులుగా గాంధీజీ, పటేల్‌జీలను కాంగ్రెస్ చీఫ్ కొనియాడారు. తద్వారా యావత్ గుజరాతీల మనసులను గెల్చుకునే ప్రయత్నం చేశారు.
Also Read :Deputy PM : ఉప ప్రధానిగా నితీశ్ ? బాబూ జగ్జీవన్ రామ్ తరహాలో అవకాశం!
జిల్లాల అధ్యక్షులకు ఫుల్ పవర్స్
సీడబ్ల్యూసీ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో అన్నింటి కంటే ముఖ్యమైనది.. పార్టీ జిల్లాల అధ్యక్షులకు ఫుల్ పవర్స్ ఇవ్వడం.ఇక నుంచి పార్టీ కేంద్ర నాయకత్వం నేరుగా జిల్లాల అధ్యక్షులతో టచ్‌లో ఉంటుంది. ఇందుకోసం ఒక కొత్త యంత్రాంగం ఏర్పాటవుతుంది. పార్టీ జిల్లాల అధ్యక్షులు నిర్దిష్ట కాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని నిర్ణయించారు. ఈ సమావేశం వేదికగా రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాల్లో దళిత, ముస్లిం, బ్రాహ్మణ ఓట్ల కోసం ప్రయత్నించింది. అందుకే ఆయా చోట్ల ఓబీసీ ఓటర్లు దూరమయ్యారు. దీనికి ఉదాహరణగా మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మాత్రమే మద్దతు ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీన్ని అడ్డుకోవాలి. మనం అందరికీ మద్దతిస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.