Site icon HashtagU Telugu

Punjab Elections 2022: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్.. ఓట‌ర్లు టెంప్ట్ అవుతారా..?

Congress Party Manifesto

Congress Party Manifesto

పంజాబ్‌లో ఫిబ్ర‌వ‌రి 20 అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న 117 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకే విడ‌త‌లో పోలీంగ్ జ‌రుగుతుంద‌ని, అక్క‌డి ఎన్నిక‌ల క‌మీష‌న్ అధికారులు తెలిపారు. ఇక పంజబ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అన్ని పార్టీలు ఓట‌ర్ల పై వ‌రాల జ‌ల్లులు కురిపించారు. అక్క‌డ అధికార కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష ఆమ్ ఆద్మీ పార్టీల‌తోపాటు బీజేపీ -పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూట‌మి, శిరోమ‌ణి అకాలీద‌ళ్- బీఎస్పీ కూట‌మి, పోటీలుప‌డి మ‌రీ ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే. పంజాబ్‌లో క‌రెక్ట్‌గా ఎన్నిక‌ల ముందు వ‌రుస‌గా కీల‌క నేత‌లు కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా, రాష్ట్రంలో అధికారం నిల‌బెట్టు కునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

ఈ నేప‌ధ్యంలో తాజాగా మేనిఫెస్టోను ప్ర‌క‌టించింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 13 హామీల‌తో కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోను రూపోందించింది. పీసీసీ చీఫ్ సిద్దూ రూపొందించిన పంజాబ్ మోడ‌ల్‌ను కూడా ఈ మేనిఫెస్టోలో పొందుప‌ర్చారు. ఈ క్ర‌మంలో సీఎం చన్నీ, నవజ్యోత్ సింగ్ సిద్ధూ అధికారికంగా ఈ మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. ఇక తాము మ‌రోసారి పంజాబ్‌లో అధికారంలోకి మొద‌టి సంత‌కం పెట్టేది ల‌క్ష‌ ఉద్యోగాల ఫైల్ పైనే అని సీఎం చ‌న్నీ ప్ర‌క‌టించారు. ప్రతి మహిళకు నెలకు 1,100 ఇస్తామని, ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ అంటే, ఏడాదికి ఒక్కో కుటుంబానికి 8 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటూ జనరంజకమైన హామీలు కాంగ్రెస్ మేనిఫెస్టీలో పొందుప‌ర్చింది.

అలాగే ఉచిత విద్య‌, ఉచిత వైద్యంతో పాటు, ఇళ్ళు లేని వారికి ఆరు నెల‌ల్లోగా ప‌క్కా గృహాలు, వృద్ధుల పెన్ష‌న్‌ను 3100రూపాయ‌ల‌కు పెంపు, .ప‌ప్పు,నూనెతో పాటు మ‌క్క పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పిస్తామ‌ని, దాని ప్ర‌కార‌మే కొనుగోలు చేస్తామ‌ని కాంగ్రెస్‌ త‌న మేనిఫెస్టోలో ప్ర‌క‌టించింది. ఇసుక త‌వ్వకాల విష‌యంలో ప్ర‌భుత్వ కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని, ఇసుక, మ‌ధ్యం మాఫియాను అంతం చేస్తామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ఇక ఈ క్ర‌మంలో నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ.. నూనెగింజలు, పప్పులు, మొక్కజొన్నలను ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇస్తున్నట్టు సిద్దూ వెల్లడించారు. ఇక‌పోతే పంజాబ్‌లో.. కాంగ్రెస్, ఆప్ఆద్మీ, బీజేపీలో మ‌ధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ క్ర‌మంలో అన్ని పార్టీలు పంజాబ్ ఓట‌ర్ల‌పై పెద్దఎత్తున వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నారు. దీంతో చివరికి పంజాబ్‌లో ప్రజలు ఎవరికీ ప‌ట్టం క‌డ‌తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని రాజకీయ విశ్లేష‌కులు అంటున్నారు.