PM – Adani Masks : పార్లమెంటు శీతాకాల సమావేశాల వేళ కాంగ్రెస్ ఎంపీలు వినూత్న నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు మాణిక్కం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీల ఫొటోలతో కూడిన ఫేస్ మాస్క్‌లను ధరించారు. వారిద్దరి ఫొటోలను కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తన ఫోన్‌తో క్లిక్‌మనిపించారు. ఈక్రమంలో అదానీ, మోడీ మాస్క్‌లను(PM – Adani Masks) ధరించిన ఇద్దరు కాంగ్రెస్ నేతలను రాహుల్ పలు ప్రశ్నలు అడిగారు.
Also Read :TG Assembly : సీఎం రేవంత్ – అదానీ ఫొటోలతో టీషర్టులు.. కేటీఆర్ సహా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అరెస్ట్
‘‘మీ ఇద్దరి (అదానీ, మోడీ) మధ్య సంబంధమేంటి ? ’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించగా.. ‘‘మేం ఇద్దరం కలిసి ప్రతీ పనిని చేస్తుంటాం. మాకు చాలా ఏళ్లుగా సంబంధం ఉంది’’ అని అదానీ, మోడీ మాస్క్‌లు ధరించిన కాంగ్రెస్ నేతలు బదులిచ్చారు. ‘‘పార్లమెంటు కార్యకలాపాలు మీ వల్లే ఆగిపోయాయి కదా ?’’ అని రాహుల్ ప్రశ్నించగా.. ‘‘అవును ఇవాళ అతడు సభకు రావడం లేదు. అమిత్ భాయ్ ఇవాళ సభకు రాడు’’ అని మోడీ మాస్క్‌ను ధరించిన నేత బదులిచ్చారు. ఇవాళ లోక్‌సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రావడం లేదు. దీన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ ఈ ప్రశ్నను అడిగారు. ‘‘నేను ఏది చెప్పినా.. ఆయన చేసేస్తాడు’’ అని అదానీ మాస్క్‌ను ధరించిన కాంగ్రెస్ నేత తెలిపారు. ఈక్రమంలో మోడీ మాస్క్‌ను ధరించిన కాంగ్రెస్ నేత వైపు ఆయన వేలెత్తి చూపించారు.
Also Read :MLC Kavitha : ఉద్యమ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చారు : ఎమ్మెల్సీ కవిత
నవంబరు 20 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. అమెరికాలో అదానీ గ్రూపుపై నమోదైన కేసుల గురించి లోక్‌సభ, రాజ్యసభల్లో దుమారం రేగుతోంది. విపక్షాలు ఈ అంశంపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అదానీ గ్రూపుపై నమోదైన కేసుల అంశంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నాయి.