Site icon HashtagU Telugu

వ‌ర‌ద‌ల స‌మీక్ష‌లో బీజేపీ మంత్రి నిద్రపై కాంగ్రెస్ ట్విట్ట‌ర్ హ్యాండిల్

Twitter Congress

Twitter Congress

క‌ర్ణాట‌క రాష్ట్రంలో వ‌ర‌ద‌ల‌పై స‌మీక్షా స‌మావేశంలో మంత్రి అశోక నిద్ర‌పోయే ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్ షేర్ చేస్తోంది. ఆయ‌న వాల‌కాన్ని ఎగ‌తాళి చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను రాష్ట్రంలో వరద పరిస్థితిని సమీక్షించే సమావేశంలో ఆర్ అశోక కళ్ళు మూసుకుని ఉన్న చిత్రాలను పంచుకుంది.”మునిగిపోవడంలో చాలా రకాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు వర్షంలో మునిగిపోయారు. మంత్రి నిద్రలో మునిగిపోతున్నారు” అని కన్నడలో ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో జరిగిన వరద సమీక్ష సమావేశం నుండి ఆర్ అశోక చిత్రాలను కూడా పంచుకున్నారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజధాని బెంగళూరు సహా కర్ణాటకలోని పలు జిల్లాలు వరదల పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. బెంగళూరులో వరదల నివారణకు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు సీఎం బొమ్మై తెలిపారు.