Rahul Gandhi: కాంగ్రెస్ రథసారథి రాహుల్ గాంధీ?

రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఢీకొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.  

  • Written By:
  • Updated On - May 13, 2022 / 12:03 AM IST

రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఢీకొట్టేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది.  పార్టీ ఏర్పాటుపై చర్చలు జరిపేందుకు కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఉదయ్‌పూర్‌లో ‘చింతన్‌ శివిర్‌’ నిర్వహించనుంది. మార్చి 14న జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి వయనాడ్ రాహుల్ కు అధ్యక్ష్య పదవిని అంగీకరించాలని చెప్పినట్లు వర్గాలు తెలిపాయి.

ఆగస్టు-సెప్టెంబర్‌లో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని సమావేశంలో ప్రతిపాదన వచ్చింది. 2019లో ఓటమి తరువాత, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సోనియా గాంధీ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా మారారు. ఉదయ్‌పూర్‌లో జరగనున్న తదుపరి చింతన్ శివిర్‌లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి చర్చలు, కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో చింతన్ శివిర్ నిర్వహిస్తున్నారు. గత ఎనిమిదేళ్లలో జరిగిన ఎన్నికల్లో పార్టీ అనేక పరాజయాలను చవిచూసింది. మే 13న జరుగబోయే సమావేశంలో సోనియా గాంధీ ప్రజలనుద్దేశించి ప్రసంగించడంతో ప్రారంభమై మే 14న రాహుల్ గాంధీ ప్రసంగంతో ముగుస్తుంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది.