Congress Leader Nephew: దారుణం.. కాంగ్రెస్ నేత మేనల్లుడు కిడ్నాప్, హత్య

ఇండోర్ (Indore) సమీపంలోని మోవ్‌లో చిన్నారి కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడి 8 ఏళ్ల మేనల్లుడు కిడ్నాప్‌కు గురైన తరువాత కుటుంబం నుండి రూ. 4 కోట్ల విమోచన క్రయధనం డిమాండ్ చేశారు. తరువాత పిల్లవాడిని హత్య చేశారు.

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 07:48 AM IST

ఇండోర్ (Indore) సమీపంలోని మోవ్‌లో చిన్నారి కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడి 8 ఏళ్ల మేనల్లుడు కిడ్నాప్‌కు గురైన తరువాత కుటుంబం నుండి రూ. 4 కోట్ల విమోచన క్రయధనం డిమాండ్ చేశారు. తరువాత పిల్లవాడిని హత్య చేశారు. మోవ్‌లోని కల్వర్టు కింద చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఈ కేసు కిషన్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిగ్దాంబర్ గ్రామానికి సంబంధించినది. ఈ కేసులో నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

కాంగ్రెస్ నేత విజయేందర్ సింగ్ చౌహాన్ తమ్ముడు జితేంద్ర సింగ్ చౌహాన్ కుమారుడు హర్ష్ (8) ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఇంటి నుంచి కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యులు తమ గ్రామంతో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చిన్నారి కోసం వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చిన్నారి కోసం వెతకగా.. చోరల్‌లోని సందల్ మెండల్ గ్రామంలోని కల్వర్టు కింద చిన్నారి మృతదేహం ఉన్నట్లు అర్థరాత్రి గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని మోవ్‌లోని సివిల్‌ ఆస్పత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గొంతు నులిమి, నోటిలో గుడ్డ బిగించి చిన్నారిని హత్య చేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో బాలుడి ముక్కు కూడా మూసుకుపోయింది.

Also Read: Hyderabad : హైద‌రాబాద్ శామీర్‌పేట చెరువులో ఇద్ద‌రు వ్య‌క్తుల గ‌ల్లంతు.. మృత‌దేహాల కోసం గాలింపు

ఆదివారం హర్ష్ బయట ఆడుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఐదు గంటల ప్రాంతంలో సైకిల్‌పై తిరుగుతున్నాడు. దీని తర్వాత అతను కనిపించకుండా పోయాడు. దీని తర్వాత మాత్రమే విమోచన కోసం కుటుంబానికి కాల్ వచ్చింది. కాంగ్రెస్ నాయకుడైన విజేందర్ చౌహాన్ కు ఓ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నీ మేనల్లుడిని కిడ్నాప్ చేశాం. చిన్నారిని విడుదల చేయాలంటే నాలుగు కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేసాడు. దీంతో వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు. హర్ష్ తండ్రి మైనింగ్ వ్యాపారి. బాలుడి మామ విజేందర్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ నాయకుడు. చిన్నారి కిడ్నాప్ హత్య వ్యవహారంలో జితేంద్ర బంధువు ఒకరి ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.