400 Paar : ఈసారి బీజేపీకి 200 సీట్లు కూడా అతికష్టమే.. శశిథరూర్ జోస్యం

400 Paar :ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను సాధిస్తుందా ?

  • Written By:
  • Updated On - May 2, 2024 / 05:29 PM IST

400 Paar :ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను సాధిస్తుందా ? ఇప్పటివరకు జరిగిన రెండు విడతల పోలింగ్‌లో ప్రజల మూడ్ ఎలా ఉంది ? ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏమిటి ? అనే అంశాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ మాట్లాడారు. ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టాపిక్స్‌పై ఆయన తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

శశిథరూర్ ఏమేం అన్నారంటే.. 

  • ‘‘బీజేపీ 400కుపైగా లోక్‌సభ సీట్లు(400 Paar)  సాధించడం అనేది ఒక జోక్.  కనీసం 300కు పైగా సీట్లు సాధించడం అసాధ్యం. ఈసారి 200 సీట్లను బీజేపీ దాటడం కూడా పెద్ద సవాలే’’ అని శశిథరూర్ పేర్కొన్నారు.
  • ‘‘కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. 2019 ఎన్నికల కంటే ఈసారి దక్షిణాదిలో బీజేపకి అధ్వానమైన ఫలితాలు వస్తాయి’’ అని థరూర్ తెలిపారు.
  • తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో తాను ఈజీగా గెలుస్తానని  థరూర్ చెప్పారు.
  • ‘‘ఇప్పటివరకు రెండు విడత పోలింగ్  ఇండియా కూటమికి అనుకూలంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ ట్రెండ్ లేదు.  2014, 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీ క్యాడర్‌లో జోష్ లేదు’’ అని శశిథరూర్ తెలిపారు.
  • ‘‘ఈ ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం మెజారిటీని కోల్పోనుంది. గత ఎన్నికల తరహా సునామీ ఫలితాలను బీజేపీ అంచనా వేసుకుంటోంది. కానీ అలా జరిగే ఛాన్సే లేదు’’ అని థరూర్ చెప్పారు.
  • ‘‘ఈ ఎన్నికల్లో కర్ణాటక, హర్యానా సహా చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పుంజుకోబోతంది. కచ్చితంగా మా లోక్‌సభ సీట్లు పెరుగుతాయి’’ అని థరూర్ పేర్కొన్నారు.

Also Read :Modi Vs Rahul : ‘యువరాజు’ను భారత ప్రధాని చేయాలని పాక్ తహతహ : ప్రధాని మోడీ

  • ‘‘ బీజేపీ హయాంలో ఉద్యోగాలకు నోచుకోని.. ఆర్థిక వ్యవస్థ కుదేలై  ఇబ్బందిపడుతున్న పేదలు తప్పకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. ఇలాంటి ఓట్లే బీజేపీని ఓడించబోతున్నాయి’’ అని థరూర్ విశ్లేషించారు.
  • ‘‘2019 లోక్‌సభ ఎన్నికల్లో పుల్వామా ఉగ్రదాడితో ఓటర్లలో ఎమోషన్‌ను రగిల్చి మోడీ గెలిచారు. ఈసారి అలాంటి పాయింట్స్ మోడీ దగ్గర లేవు. అందుకే రామమందిరం, ముస్లింల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు.  ఈసారి అవన్నీ పనిచేయవు’’ అని థరూర్ అభిప్రాయపడ్డారు.

Also Read :Vijay Devarakonda : బాలకృష్ణ కాదు రౌడీ హీరోని లైన్ లో పెడుతున్న డైరెక్టర్..!