దేశ విభజన అంశం కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పరమైన అంశంగా మారింది. జనవరి 26వ తేదీన మోడీ చేసిన ప్రసంగాన్ని ఉటంకిస్తూ ఇప్పుడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ మంత్రి సజ్జన్ సింగ్ వర్మ సంచలన కామెంట్లు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడైన జిన్నా దేశాన్ని 1947లో దేశాన్ని విభజించడం ద్వారా మంచిపనిచేశారని సమర్థించారు. నెహ్రూ, జిన్నా ఇద్దరూ కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేశారని మోడీ చేసిన ఆరోపణకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
“ఒకరు ముస్లిం అయినందుకు జిన్నా స్వాతంత్ర్య సమరయోధుడు కాడా? బీజేపీ ఇలాంటి సంస్కృతిని ప్రచారం చేస్తోంది అంటూ దుయ్యబట్టారు. 1947లో దేశాన్ని విభజించడానికి జవహర్‌లాల్ నెహ్రూ మరియు జిన్నా కారణమని ప్రధాని మోదీ జనవరి 26న తన ప్రసంగంలో అన్నారు. దేశాన్ని రెండు ముక్కలు చేయడం ద్వారా విజ్ఞతతో కూడిన పని చేసినందుకు దేశం ఇద్దరు నాయకులకు ధన్యవాదాలు చెప్పాలి, ”అని వర్మ అన్నారు.
జిన్నా దేశాన్ని విభజించకపోతే ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోదీకి పదవు ఉండేవి కాదని అన్నారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరియు ముహమ్మద్ అలీ జిన్నా “చట్టం ప్రకారం దేశాన్ని విభజించారని మంత్రి సజ్జన్ సింగ్ వర్మ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుడు జిన్నాను “స్వాతంత్ర్య సమరయోధుడు”గా పేర్కొన్నాడు. దేశాన్ని విభజించడం ద్వారా అతను “సరైన పని” చేసాడని కితాబిచ్చారు.
“నెహ్రూ మరియు జిన్నా దేశాన్ని విచ్ఛిన్నం చేయలేదు. జిన్నా అతను స్వాతంత్ర్య సమరయోధుడు కాదా? “ముస్లిం అయినందుకు స్వాతంత్ర్య సమరయోధుడి నిర్వచనం మారుతుందా” అని వర్మ బీజేపీ నేతలపై విరుచుపడ్డారు.