Site icon HashtagU Telugu

Rahul Gandhi: రైతులకు 3 లక్షల రుణమాఫీ హామీ ప్రకటించిన రాహుల్ గాంధీ..గుజారత్ లో వరాల జల్లు..!!

Rahul Gandhi

Rahul Gandhi

గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేతలంతా రాష్ట్రంలో పర్యటిస్తూ..ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ లో పర్యటించారు. ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు హామీల వర్షం కురిపించారు రాహుల్.

గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే…ఆ రాష్ట్ర రైతులకు మూడు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 1000 రూపాయలుగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ను 5వందలకే అందిస్తామన్నారు. రైతులకు ఫ్రీగా కరెంట్ ఇవ్వడంతోపాటు..పాల ఉత్పత్తిదారులకు లీటరుకు 5 సబ్సిడీ ఇస్తామని చెప్పారు. బాలికలకు ఉచిత విద్య అందించడంతోపాటు సాధారణ వినియోగదారులకు 300ల యూనిట్ల వరకు విద్యుత్ ను ఫ్రీగా అందిస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.

అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల కొత్త ఉద్యోగాలు, 3వేల ఇంగ్లీష్ మీడియం పాఠశాలుల, బాలికలకు ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ బడావ్యాపారవేత్తలకు రుణమాఫీ చేస్తుంది…రైతులకు ఎప్పుడైనా చేసిందా అని ప్రశ్నించారు. అహ్మదాబాద్ లో పరివర్తన్ సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ వరాల జల్లు కురిపించారు.