Site icon HashtagU Telugu

Rahul – Farm Work : తలకు టవల్.. చేతిలో కొడవలి.. పొలం పనుల్లో రాహుల్

Rahul Farm Work

Rahul Farm Work

Rahul – Farm Work : అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ..  ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్న రాహుల్..  రెండోరోజు (ఆదివారం ఉదయం) ఓ  ప్రచార కార్యక్రమానికి వెళ్తూ నవ రాయ్‌పూర్‌లోని కటియా గ్రామంలో పొలం పనులు చేస్తున్న రైతులను పలకరించారు. వారితో కలిసి పొలం పనులు చేశారు. ఈక్రమంలో వారిని అడిగి సాధకబాధకాలను తెలుసుకున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, కరెంటు బిల్లులు, ఎరువుల లభ్యత, రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధర వంటి అంశాల గురించి రాహుల్ ఆ రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రస్తుత సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

తలకు టవల్ కట్టుకొని.. చేతిలో కొడవలి పట్టుకుని రాహుల్ స్వయంగా వరి కోత పనులు చేశారు. ఈసందర్భంగా రాహుల్ వెంట ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్,  డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్‌దేవ్, హోం మంత్రి తామ్రధ్వజ్ సాహు, అసెంబ్లీ స్పీకర్ చరదాస్ మహంత్  కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు రాహుల్ గాంధీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. రైతులు సంతోషంగా ఉంటేనే ఇండియా సంతోషంగా ఉంటుందని ఈ పోస్టుకు రాహుల్ క్యాప్షన్ (Rahul – Farm Work)) పెట్టారు.

Also Read: Noahs Ark : ‘నూహ్ ఓడ’ ఇదేనా ? టర్కీలో అగ్నిపర్వతం వద్ద చారిత్రక శిలాజం !