Site icon HashtagU Telugu

Lok Sabha Elections 2024: వాయనాడ్‌ ఎంపీగా రాహుల్ నామినేషన్ దాఖలు

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు గానూ రాహుల్ గాంధీ ఈ రోజు వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్‌కు ముందు వాయనాడ్‌లో రాహుల్ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు. రోడ్ షోలో వాయనాడ్ ప్రజలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. అనంతరం ఆయన ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా నామినేషన్ దాఖలు చేశారు.

వాయనాడ్ నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు రాహుల్. నా సోదరి ప్రియాంకతో ఎలా ఉంటానో ఈ నియోజక వర్గంలో ఉన్న నా సోదరీమణులు,తల్లులతో అలానే ఉంటానన్నారు రాహుల్. ఇక్కడ మానవ-జంతు సంఘర్షణ సమస్య ఉంది. మెడికల్ కాలేజీ సమస్య ఉంది. ఈ పోరాటంలో నేను వాయనాడ్ ప్రజలకు అండగా నిలుస్తాను. మెడికల్ కాలేజీపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించామని అన్నారు. నేను సీఎంకు లేఖ రాశామని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తూ వారు ముందుకు కదలలేదు.ఢిల్లీలో, మరియు కేరళలో మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు రాహుల్. ఇంకా రాహుల్ మాట్లాడుతూ.. మీ పార్లమెంటు సభ్యుడిగా ఉండటం నాకు గౌరవంగా ఉంది. నేను మిమ్మల్ని ఓటర్లుగా భావించనని , మీరంతా నా కుటుంబ సభ్యులుగానే భావిస్తానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ తన వైఖరిని తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల గొంతును అణిచివేస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. వారిని కట్టడి చేయాలంటే మొదటి అడుగు వాయనాడ్ నుండి పడుతుందన్నారు. వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా భార్య అన్నీ రాజా పోటీ చేస్తుంది. ఈ మేరకు ఆమె నామినేషన్ దాఖలు చేశారు. కాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ను వాయనాడ్‌ నుంచి అభ్యర్థిగా నిలిపింది. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి 4 లక్షలకు పైగా భారీ మెజార్టీతో గెలుపొందారు.

Also Read: Rupay Card New Features : ‘రూపే’ కార్డులో మూడు కొత్త ఫీచర్లు.. ఇవిగో