Priyanka Gandhi Vadra : కేరళ వయనాడ్ లోకసభ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకగాంధీ వాద్రా భారీ విజయాన్ని అందుకున్నారు. మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంక గాంధీ బీజేపీ నేత, సమీప అభ్యర్థి నవ్య హరిదాస్‌పై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీ ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ స్థానంలో సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని ప్రియాంక దాటేసి రికార్డు సృష్టించారు. రెండో స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి నిలిచారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10 వేల ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు.
కాగా, ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి పోటీ చేసిన రాహుల్.. సీపీఐ నాయకురాలు అన్నీ రాజాపై 3.64 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయ్‌బరేలీలోనూ విజయం సాధించడంతో ఆ తర్వాత ఆ స్థానాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఝార్ఖండ్ తొలి విడత ఎన్నికలతో పాటుగా ఈ నెల 13న ఇక్కడ పోలింగ్ జరిగింది. వయనాడ్‌లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ నేత పీపీ సునీర్‌పై 4.3 లక్షల మెజార్టీతో రాహుల్ గాంధీ విజయం సాధించారు.
మరోవైపు తన సతీమణి విజయంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్పందించారు. ‘ప్రియాంక కృషిని గుర్తించిన వయనాడ్ ప్రజలకు ధన్యవాదాలు. ఆమె కచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తారని తెలుసు. ప్రజల సమస్యలను పార్లమెంట్‌లో వినిపించేందుకు ప్రియాంక శ్రమిస్తారు. ప్రస్తుతం పుస్తకాలు చదవడం.. పిల్లలను చూసుకోవడంలో బిజీగా ఉన్న ప్రియాంక ఇప్పుడు దేశ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.
Read Also: Governor Statue : రాజ్‌భవన్‌లో గవర్నర్ విగ్రహం.. స్వయంగా ఆవిష్కరించిన ఆనంద్ బోస్